ఇండోర్ స్టేడియంలోని కబడ్డీ అకాడమీలో మ్యాట్‌పై ప్రాక్టీస్ చేస్తున్న క్రీడాకారులు
రైడింగ్.. డిఫెండింగ్‌పై ఫోకస్
కబడ్డీలో కీలకమైన రైడింగ్, డిఫెండింగ్‌తోపాటు లెఫ్ట్ కార్నర్, రైట్ కార్నర్ విభాగాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. మ్యాచ్ పరిస్థితులను అంచనా వేసి నిర్ణయాలు తీసుకోవడం, ప్రత్యర్థి వ్యూహాలను ఎదుర్కోవడం, వేగం–సమన్వయాన్ని పెంచేలా సాధన చేయిస్తున్నారు. శారీరక దారుఢ్యంతోపాటు ఆటలో మెళకువలను మెరుగుపర్చేలా శిక్షణ సాగుతోంది.


