అకాడమీలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులను భవిష్యత్‌లో జూనియర్, సీనియర్ విభాగాల పోటీలతోపాటు ఎస్‌జీఎఫ్ రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు సన్నద్ధం చేయనున్నారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి వారికి నిరంతర శిక్షణ అందించడం ద్వారా రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించేలా తీర్చిదిద్దడమే అకాడమీ లక్ష్యంగా ఉంది. దీంతో పాలమూరు క్రీడా రంగంలో కబడ్డీకి కొత్త ఊపు వస్తుందని క్రీడాభిమానులు ఆశిస్తున్నారు.
●
అకాడమీ ప్రత్యేకతలు
రాష్ట్రంలో తొలి బాలుర కబడ్డీ అకాడమీ
ప్రస్తుతం 20 మంది క్రీడాకారులు
ఉమ్మడి జిల్లా నుంచి ఆరుగురు
రోజుకు రెండు పూటలా శిక్షణ
మ్యాట్, క్లే కోర్టుల్లో సాధన
రైడింగ్, డిఫెండింగ్‌పై ప్రత్యేక దృష్టి
ఎస్‌జీఎఫ్ రాష్ట్ర, జాతీయ పోటీలే లక్ష్యం


