మహబూబ్‌నగర్‌కు మూడో విజయం | - | Sakshi
Sakshi News home page

మహబూబ్‌నగర్‌కు మూడో విజయం

Aug 29 2026 1:10 AM | Updated on Aug 29 2026 1:10 AM

మహబూబ్‌నగర్‌ క్రీడలు: హైదరాబాద్‌లో జరుగుతున్న సీ–డివిజన్‌ వన్డే లీగ్‌ చాంపియన్‌షిప్‌లో హెచ్‌సీఏ డిస్ట్రిక్ట్‌–4 (మహబూబ్‌నగర్‌) జట్టు మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో జిల్లా జట్టు 135 పరుగుల తేడాతో బాయ్స్‌ టౌన్‌ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన హెచ్‌సీఏ డిస్ట్రిక్ట్‌–4 జట్టు 45.5 ఓవర్లలో 10 వికెట్లకు 193 పరుగులు చేసింది. జట్టులో వసికర్‌ 44, అఫ్వాన్‌ 37 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన బాయ్స్‌ టౌన్‌ జట్టు జిల్లా బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లను కోల్పోయింది. 29.5 ఓవర్లలో 58 పరుగులకు ఆలౌట్‌ అయింది. జిల్లా బౌలర్లు ధనూష్‌ కుమార్‌ 7 ఓవర్లలో 9 పరుగులు ఇచ్చి 4 వికెట్లు, అభినవ్‌ 7.5 ఓవర్లలో 13 పరుగులు ఇచ్చి4 వికెట్లు తీశారు. వన్డే లీగ్‌ మ్యాచ్‌లో జిల్లా జట్టు విజయం సాధించడంపై ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్‌ హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement