భూత్పూర్: రక్షాబంధన్ సందర్భంగా భూత్పూర్ మండలం అన్నాసాగర్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు వినూత్నంగా మొక్కలకు రాఖీలు కట్టారు. వృక్షాలను సంరక్షిస్తే అవే మనకు రక్షణగా నిలుస్తాయని ప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని బాధ్యతగా సంరక్షించాలని సూచించారు. భవిష్యత్ తరాలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలంటే విరివిగా మొక్కలు నాటి కాపాడాల్సిన అవసరం ఉందని విద్యార్థులకు అవగాహన కల్పించారు.
బెంగళూర్ టు పాలమూరు
జిల్లా కేంద్రానికి చెందిన గొండ్యాల రాఘవేంద్రశర్మ, గొండ్యాల గోపాలకృష్ణ శర్మ . వీరి సోదరి ప్రత్యూష బెంగుళూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. వృత్తిరీత్యా ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రత్యూష రాఖీ పండుగ కోసం తన అన్నలకు రాఖీలు కట్టడానికి బెంగళూర్ నుంచి పాలమూరు నగరానికి వచ్చారు. కొన్నేళ్ల నుంచి క్రమం తప్పకుండా రాఖీ పండుగ కోసం మమబూబ్‌నగర్‌కు వచ్చి అన్నలకు రాఖీ కట్టి పండుగను ఎంతో సంతోషంగా జరుపుకొని తిరిగి బెంగళూర్‌కు వెళుతున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘చిన్నప్పటి నుంచి రాఖీ పండుగ అంటే ఎంతో ఇష్టం. రాఖీ పండగ ఎప్పుడు వస్తుంది అన్నవాళ్లకు రాఖీలు ఎప్పుడు కట్టాలనుకునే కుతూహలం ఉండేది.ఈ సారి కూడా అన్నలకు రాఖీలు కట్టడానికి పాలమూరు వచ్చాను.’ అని తెలిపారు.


