పండుగ వేళ.. సరిపోని బస్సులు | - | Sakshi
Sakshi News home page

పండుగ వేళ.. సరిపోని బస్సులు

Aug 28 2026 12:57 AM | Updated on Aug 28 2026 12:57 AM

కిక్కిరిసి పోయిన బస్టాండ్లు

కొన్ని గంటల పాటు వేచి ఉన్న

ప్రయాణికులు

విద్యార్థులతోపాటు

వందలాది మంది రాకపోకలు

4 రోజుల పాటు 490

ప్రత్యేక బస్సుల ఏర్పాటు

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: రాఖీ పండుగ నేపథ్యంలో గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు మహబూబ్‌నగర్‌తో పాటు ఉమ్మడి జిల్లాలోని బస్టాండులు ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ఇక సాయంత్రం పాఠశాలలు, కళాశాలల తరగతులు ముగిసిన వెంటనే విద్యార్థులు స్వగ్రామాల బాట పట్టారు. దీంతో కొత్త బస్టాండుకు తరలిరాగా.. వందలాది మంది తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరి స్థితి నెలకొంది. ప్లాట్‌ఫాంల వద్దకు ఏ బస్సు వచ్చినా జనం ఎగబడి ఎక్కా రు. ఇక మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండటంతో చాలా మంది తోసుకుంటూ ముందుకు కదిలారు. ఒక్కసారిగా ప్రయాణికులు ఎగబడటంతో ఏ రూట్‌లోనూ బస్సులు సరిపోలేదు. ముఖ్యంగా హైదరాబాద్‌, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట, గద్వాల జిల్లాలకు వెళ్లాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినా..

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు మహబూబ్‌నగర్‌ రీజియన్‌ పరిధిలో ఈనెల 27 నుంచి 31వ తేదీ వరకు మధ్యలో ఒక్కరోజు (ఈనెల 29) మినహా నాలుగు రోజుల పాటు మొత్తం 490 బస్సులను అదనంగా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా నెల 27న నాగర్‌కర్నూల్‌ డిపో నుంచి 12, మహబూబ్‌నగర్‌ నుంచి 10, గద్వాల నుంచి 11, వనపర్తి, అచ్చంపేట, షాద్‌నగర్‌ డిపోల నుంచి 9 చొప్పున కల్వకుర్తి, కోస్గి నుంచి 8 చొప్పున, కొల్లాపూర్‌ నుంచి 6, నారాయణపేట నుంచి 5 బస్సులను ఇలా మొత్తం 87 అదనంగా నడిపారు.

● ఈనెల 28న మహబూబ్‌నగర్‌ డిపో నుంచి 38, నాగర్‌కర్నూల్‌ నుంచి 30, షాద్‌నగర్‌ నుంచి 26, అచ్చంపేట నుంచి 22, కల్వకుర్తి, నారాయణపేట నుంచి 20 చొ ప్పున, గద్వాల నుంచి 14, కొల్లాపూర్‌ నుంచి 12, వనపర్తి నుంచి 10, కోస్గి నుంచి 8 చొప్పున మొత్తం 200 ప్రత్యేక బస్సులు నడవనున్నాయి.

● ఈనెల 30న నాగర్‌కర్నూల్‌ డిపో నుంచి 21, షాద్‌నగర్‌ నుంచి 17, కల్వకుర్తి నుంచి 12, వనపర్తి నుంచి 10, నారాయణపేట, కోస్గి నుంచి 8 చొప్పున, మహబూబ్‌నగర్‌, అచ్చంపేట నుంచి 7 చొప్పున, కొల్లాపూర్‌ నుంచి 6, గద్వాల నుంచి 5 చొప్పున మొత్తం 101 ప్రత్యేక బస్సులు నడవనున్నాయి.

● ఈనెల 31న నాగర్‌కర్నూల్‌ డిపో నుంచి 15, గద్వాల, వనపర్తి నుంచి 13 చొప్పున, మహబూబ్‌నగర్‌, షాద్‌నగర్‌ నుంచి 10 చొప్పున, కల్వకుర్తి, నారాయణపేట, అచ్చంపేట నుంచి 9 చొప్పున, కోస్గి నుంచి 8, కొల్లాపూర్‌ నుంచి 6 చొప్పున మొత్తం 102 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. అయినప్పటికీ ఇవి ఏమాత్రం సరిపోవని ప్రయాణికులు వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement