క్లుప్తంగా
కోస్గి రూరల్: పెళ్లికి వెళ్లి తిరుగొస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘ టన గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం మేరకు మండల పరిధిలో ని సర్జఖాన్‌పేట్‌కు చెందిన కామర్తి రాకేష్ (28) తన స్నేహితుడి అన్న పెళ్లి ఉండడంతో బుధవా రం రాత్రి కొత్తపల్లికి వెళ్లాడు. పెళ్లి వేడుక అనంతరం గురువారం తెల్లవారుజామున బైక్‌పై స్వ గ్రామానికి బయలుదేరాడు. చంద్రవంచ గేట్ సమీపంలోకి రాగానే గుర్తు తెలియని వాహనం బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో తల కు తీవ్రగాయాలై రోడ్డుపై విగతజీవిగా పడి ఉండగా అటుగా వెళ్తున్న కొందరు గమనించి 108లో కోస్గి ఆస్పత్రికి తరలించి అలాగే కు టుంబసభ్యులకు సమాచారం అందించారు. తీ వ్ర రక్తస్రావం కావడంతో జిల్లా ఆస్పత్రికి తరలించి అక్కడి నుంచి హైదరాబాద్‌లోని నిమ్స్ కు తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో గురువారం అర్ధరాత్రి యువకుడు మృతి చెందాడు. తండ్రి ప్రభు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
స్కూటీ అదుపుతప్పి: యువకుడు మృతి
దేవరకద్ర రూరల్: రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని తప్పించబోయే క్రమంలో స్కూటీ అదుపు తప్పి బోల్తాపడడంతో యువకుడు మృతి చెందగా, మరో యువకుడు గాయపడిన ఘటన గురువారం దేవరకద్రలో చోటుచేసుకుంది. స్థానిక కథనం ప్రకారం.. మరికల్ మండలం అప్పంపల్లికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి (28) సాయికుమార్ దేవరకద్రలోని వినాయక విగ్రహ తయారీ కేంద్రాలను పరిశీలించడానికి వచ్చారు. హెచ్‌పీ పెట్రోల్ బంకు సమీపంలో రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని తప్పించబోయి స్కూటీ ఆదుపు తప్పడంతో రోడ్డుపై పడిపోయారు. ఈ ప్రమాదంలో శ్రీనివాస్‌రెడ్డి తలకు బలమైన గాయమైది. కాగా, స్థానికులు క్షతగాత్రులిద్దరిని 108లో జిల్లా ఆస్పత్రికి తరలించగా, శ్రీనివాస్‌రెడ్డిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. సాయికుమార్ చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనతో అప్పంపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.


