ట్రాన్స్‌ఫార్మర్ల చోరీ ముఠా గుట్టురట్టు | - | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌ఫార్మర్ల చోరీ ముఠా గుట్టురట్టు

Aug 28 2026 12:57 AM | Updated on Aug 28 2026 12:57 AM

ఐదుగురి అరెస్టు

రూ.2లక్షల నగదు,

వాహనాలు స్వాధీనం

కొత్తకోట: విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల చోరీకి పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం కొత్తకోట పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వనపర్తి డీఎస్పీ బాలాజీ వెల్లడించారు. ఐదుగురు నిందితులు ముఠాగా ఏర్పడి విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లలోని కాపర్‌ కాయిల్స్‌ చోరీ చేస్తున్నారు. ముందుగా రెక్కీ నిర్వహించి, జనసంచారం లేని ప్రాంతాల్లో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను గుర్తించేవారు. రాత్రివేళ విద్యుత్‌ సరఫరా నిలిపివేసి, ట్రాన్స్‌ఫార్మర్లను విడదీసీ కాపర్‌ కాయిల్స్‌ చోరీ చేస్తున్నారు. దొంగిలించిన ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్‌లో సుమారు 40 నుంచి 45 కిలోల కాపర్‌ కాయిన్‌ ఉంటుందని.. కిలోకు రూ. 200 చొప్పున విక్రయించే వారని డీఎస్పీ తెలిపారు. వనపర్తి జిల్లాలో 9, మహబూబ్‌నగర్‌లో 5, గద్వాలలో 4, నారాయణపేటలో 3, మరో ప్రాంతంలో 2 ట్రాన్స్‌ఫార్మర్లను చోరీ చేసిన ట్లు పోలీసుల విచారణలో వెల్లడైందని పేర్కొన్నా రు. నిందితుల నుంచి మరిన్ని చోరీల వివరాలను రాబట్టేందుకు విచారణ కొనసాగిస్తున్నామన్నారు. చోరీకి ఉపయోగించిన రెండు ట్రాలీ ఆటోలు, రెండు ద్విచక్ర వాహనాలతో పాటు రూ. 2లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. సమావేశంలో సీఐ ఓడీ రమేష్‌, ఎస్‌ఐలు విక్రమ్‌, భాస్కర్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement