జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): మహబూబ్‌నగర్‌కు చెందిన డా.మంజుల (డా.కృష్ణ సతీమణి) 50 ఏళ్ల వయసులో బైక్‌పై అత్యంత సాహసోపేతమైన లేహ్–లడఖ్ యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో పాటు బంగీ జంప్ సాహసం చేసి అరుదైన ఘనత సాధించారు. తెలంగాణ, ఏపీలో ఈ మార్గంలో బైక్‌పై ప్రయాణించిన తొలి మహిళగా ఆమె ఘనత సాధించారు. చిన్ననాటి నుంచే బైక్‌పై లేహ్–లడఖ్‌కు వెళ్లాలనే కలను కలిగిన ఆమె పట్టుదలతో ఆ కలను సాకారం చేసుకున్నారు. ఈమె గద్వాల్‌లో పుట్టి, విద్యాభ్యాసమంతా అక్కడే సాగింది. ఉద్యోగ జీవితాన్ని జిల్లా కేంద్రంలో కొనసాగిస్తున్నారు. మంజుల చేపట్టిన యాత్రలో లేహ్ లోకల్ –మ్యాగ్నెటిక్ హిల్ – హాల్ ఆఫ్ ఫేమ్ – ఖర్దుంగ్ లా – నుబ్రా – తుర్తుక్ – థాంగ్ (భారత్‌లోని చివరి గ్రామం) – నుబ్రా – వారిలా – చాంగ్ లా – పాంగాంగ్ సరస్సు – లేహ్ వంటి అత్యంత క్లిష్టమైన ప్రాంతాలు ఉన్నాయి. ఎత్తైన పర్వత మార్గాలు, తీవ్రమైన చలి, కఠినమైన రహదారులు వంటి ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ సాహస యాత్రను పూర్తి చేశారు. రాయల్ ఎన్‌న్‌ఫీల్డ్ సంస్థ అధికారికంగా మంజుల సాధించిన ఈ ఘనతను ధృవీకరించి, ఈ మార్గంలో బైక్‌పై ప్రయాణించిన తొలి మహిళగా గుర్తింపు పొందినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంజుల మాట్లాడుతూ కుటుంబం అందించిన ప్రోత్సాహం, సహకారం వల్లే తన కలను నిజం చేసుకోగలిగానన్నారు.


