పాలమూరు: జిల్లాలో ఆరేళ్లుగా నిలిచిపోయిన పనులకు ప్రస్తుతం మోక్షం కలిగింది. బడ్జెట్ లేమితో కాంట్రాక్టర్లు నిర్మాణ పనులు వదిలేయగా సబ్ సెంటర్ల భవనాలు నిరుపయోగంగా మారి.. వైద్యసేవలకు ఆటంకంగా మారింది. దీంతో పెండింగ్‌లో ఉ న్న సబ్ సెంటర్లను పూర్తి చేసి ప్రజలుకు అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభు త్వం ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా జిల్లాకు ఎన్‌హెచ్‌ఎం నిధులు రూ.2.40 కోట్లు మంజూరయ్యాయి. జిల్లా ఆరోగ్య శాఖ పరిధిలో మొత్తం 24 సబ్ సెంటర్లు అసంపూర్తిగా మిగిలిపోగా.. ప్రస్తు తం విడుదలైన నిధులతో ఆయా భవనాలు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనిపై డీఎంహెచ్‌ఓ శ్రీనివాసులును వివరణ కోరగా ప్రస్తుతం జిల్లాకు వచ్చిన బడ్జెట్‌తో పెండింగ్‌లో ఉన్న సబ్ సెంటర్ల పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ మేరకు జిల్లాలో అమిస్తాపూర్, తాటిపర్తి, అన్నాసాగర్ సబ్ సెంటర్లను శనివారం పరిశీలించామని పేర్కొన్నారు.


