సమాజ తలరాత మార్చేది యువతే | - | Sakshi
Sakshi News home page

సమాజ తలరాత మార్చేది యువతే

Aug 21 2026 7:51 AM | Updated on Aug 21 2026 7:51 AM

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): సమాజ తలరాత మార్చే శక్తి ఒక్క యువతకు మాత్రమే ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు ఎం.నరసింహ అన్నారు. అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా 13వ మహాసభలు గురువారం స్థానిక కార్యాలయంలో నిర్వహించారు. ముందుగా శాంతి అభ్యుదయం శాసీ్త్రయ సోషలిజం ఆశయాలు గల ఏఐవైఎఫ్‌ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బాలనరసింహా మాట్లాడుతూ యువత ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా వివక్ష ధోరణి ప్రదర్శిస్తూ యువతతో కయ్యం పెట్టుకున్న ఏ పాలక ప్రభుత్వాలకు, ఎంతటి వారినైనా కాలగర్భంలో కలిసిపోక తప్పదని హెచ్చరించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి యువతను ఉద్దేశించి పొద్దింకలతో పోలిస్తే బొద్దింకల పేరుతోనే పార్టీ ఏర్పాటు చేసి మార్పునకు చేసిన వీరోచిత పోరాటానికి మోదీ సర్కారు తలవంచక తప్పలేదని గుర్తు చేశారు. 80 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో నేటికి నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేదని ఏటా రెండు కోట్ల ఉద్యోగాలతో అధికారంలో వచ్చిన మోదీ ప్రభుత్వం ఉద్యోగాల కల్పన హామీని విస్మరించి ఫాసిస్ట్‌ విధానాలను అనుసరించడం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు కలంకమన్నారు. అనంతరం ఏఐవైఎఫ్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎన్‌. శ్రీకాంత్‌ మాట్లాడుతూ దేశంలో నేడు విద్య వైద్యం ఉపాధి అందని ద్రాక్షగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. సెప్టెంబర్‌ 8న యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో ఏఐవైఎఫ్‌ రాష్ట్ర మహాసభల సందర్భంగా యువజన కవాత్‌ నిర్వహిస్తున్నామని 9, 10 తేదీల్లో ప్రతినిధుల సభలు జరగతాయని యువత పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యదర్శి బృంగి బాలకిషన్‌, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి బిజ్జా శ్రీనివాస్‌, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర మాజీ సహాయ కార్యదర్శి సురేష్‌, ఏఐవైఎఫ్‌ జిల్లా కన్వీనర్‌ రాము, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజు, ఏఐవైఎఫ్‌ జిల్లా కో కన్వీనర్‌ మహేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement