● పంచాయతీరాజ్ చాంబర్
రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): హక్కుల సాధన కోసం సర్పంచ్‌లు పోరాటాలకు సిద్ధం కావాలని పంచాయతీ రాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఉమ్మడి జిల్లా సర్పంచ్‌ల చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ పంచాయతీ రాజ్ 2018 చట్టాన్ని, ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీ విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1090 కో ట్లను విడుదల చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మ్యా చింగ్ గ్రాంట్లు రూ. 2979 కోట్లు పెండింగ్ బకాయిలు ఉంచిందని వెంటనే చెల్లించేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడిగా వెంకట్రాములుగౌడ్, నాగ ర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా వార్ల వెంకటయ్య, వనపర్తి జిల్లా అధ్యక్షుడిగా శ్రీధర్‌లు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర ప్రతినిధి పురుషోత్తంరెడ్డి, సుప్రియ, రాజశేఖర్, శివశంకర్‌గౌడ్, వెంకట్ పాల్గొన్నారు.


