నదిలో దూకిన యువతి: కాపాడిన గజఈతగాడు | - | Sakshi
Sakshi News home page

నదిలో దూకిన యువతి: కాపాడిన గజఈతగాడు

Aug 20 2026 3:52 AM | Updated on Aug 20 2026 3:52 AM

ఎర్రవల్లి: కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెందిన ఓ యువతి కృష్ణానదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేయగా ఓ గజఈతగాడు చాకచక్యంగా వ్యవహరించి నిండు ప్రాణాన్ని కాపాడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం మేరకు.. అయిజ మండలంలోని పులికల్‌ గ్రామానికి చెందిన ఓ యువతి తండ్రి నిత్యం మద్యం తాగి కుటుంబ సభ్యులతో గొడవపడుతూ ఉండేవాడు. ఈ సంఘటనపై పలుమార్లు అయిజ పీఎస్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో మనస్తాపానికి గురైన యువతి మంగళవారం సాయంత్రం బీచుపల్లి కృష్ణానది బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకింది. ఈ క్రమంలో జాతీయ రహదారిపై వెళ్తున్న ప్రయాణికులు గమనించి కేకలు వేయడంతో స్థానికుల సమాచారం మేరకు కొండపేటకు చెందిన గజఈతగాడు బాబు జోరువానలో పుట్టీ సహాయంతో ఆమె ప్రాణాలను కాపాడాడు. ఇటిక్యాల ఎస్‌ఐ రవిరాథోడ్‌ సంఘటనా స్థలానికి చేరుకొని యువతికి కౌన్సెలింగ్‌ చేసి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. జోరువానలో యువతి ప్రాణాలను కాపాడిన బాబును పలువురు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement