అలంపూర్ క్షేత్రంలో వెలిసిన శ్రీ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం రెండో రోజు మండల పూజలు కొనసాగాయి. శ్రీజోగుళాంబ అమ్మవారి ఆలయంలో శ్రీచక్ర ప్రతిష్ఠాపన జరిగి 40 రోజులు కావడంతో మూడు రోజుల పాటు శృంగేరి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి స్వామివారి శిష్యులు అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని, స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని హోమ మండపంలో హోమ పూజలు నిర్వహించారు. అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేసి, ఆశీర్వచనం పలికారు. అలంపూర్


