తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై నిత్యం పర్యవేక్షణ చేస్తుండాలి. వారు ఎలాంటి స్నేహితులతో తిరుగుతున్నారు.. ఎలా చదువుతున్నారు అనేది చూడాలి. మత్తు పదార్థాలు అధికంగా వాడటం వల్ల నరాల వ్యవస్థలను దెబ్బతీస్తుందని, మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తుంది. ఎప్పుడైనా అందుబాటులో లేకపోతే ఒక్కోసారి మనిషి విచక్షణ కోల్పోయి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాడు. కొన్ని సందర్భాల్లో సైకోగా మారి ఇతరులకు నష్టం చేయడం కానీ లేదా తనకు తాను గాయపరుచుకోవడం లేదంటే ఆత్మహత్యకు పాల్పడుతుంటారు.
– అనిల్ రాజ్, మానసిక వైద్యుడు, జనరల్ ఆస్పత్రి, మహబూబ్‌నగర్
విస్తృతంగా తనిఖీలు..
జిల్లాలో గంజాయి సరఫరా కట్టడికి పోలీస్ శాఖ విస్తృతంగా తనిఖీలు చేపడుతోంది. ప్రతి పోలీస్ స్టేషన్‌లో గంజాయి పరీక్ష కిట్లు అందుబాటులో ఉన్నాయి. అనుమానాస్పదంగా కనిపిస్తే తప్పక పరీక్షలు చేస్తున్నాం. పాజిటివ్ వస్తే వెంటనే జనరల్ ఆస్పత్రి డీ–అడిక్షన్ సెంటర్‌కు తరలించి కౌన్సెలింగ్, చికిత్స అందిస్తున్నాం. దీంతోపాటు కళాశాల, పాఠశాల, వైద్య కళాశాలల్లో మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం.
– వెంకటేశ్వర్లు, డీఎస్పీ, మహబూబ్‌నగర్
ప్రత్యేక దృష్టిపెట్టాం..
ఉమ్మడి జిల్లాలో ఎకై ్సజ్ శాఖ నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇటీవల జడ్చర్ల ఏరియాలోని పరిశ్రమలు ఉండే ప్రాంతంలో విస్తృతంగా సోదాలు చేశాం. గంజాయి వినియోగం జరుగుతుందనే సమాచారం వచ్చిన ఏరియాలపై ప్రత్యేక దృష్టిపెట్టి దాడులు చేస్తున్నాం.
– శ్రీనివాసులు, ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్, ఉమ్మడి జిల్లా


