ముద్దుగా.. టీకా వేయిద్దాం | - | Sakshi
Sakshi News home page

ముద్దుగా.. టీకా వేయిద్దాం

Jul 6 2026 12:58 AM | Updated on Jul 6 2026 12:58 AM

ఇంట్లో ఒకరిలా..

ముందస్తు జాగ్రత్తలు...

గొలుసులతో బంధించి కాదు..

పెంపుడు జంతువులకు సకాలంలో టీకాలు తప్పనిసరి

నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతక

వ్యాధుల ముప్పు

జంతువుల పెంపకంపై

పెరుగుతున్న ఆసక్తి

అవగాహన, వ్యాక్సినేషన్‌తో

సంరక్షణ సులభం అంటున్న వైద్యులు

నేడు ప్రపంచ జునోసిస్‌ డే

మహబూబ్‌నగర్‌ (వ్యవసాయం)/జడ్చర్ల టౌన్‌: అనాదిగా మూగజీవాలతో మనిషికి విడదీయలేని బంధం ఏర్పడింది. పెంపుడు శునకాలు, పిల్లులు, కుందేళ్లు వంటి జంతువులను ఇంటి సభ్యుల్లా చూసుకునే వారి సంఖ్య గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగింది. కొందరు ప్రేమ తో.. మరికొందరు స్టేటస్‌ చూపడానికి.. ఇంకొందరు ఇంటికి రక్షణ కోసం మూగజీవాల్ని పెంచుతూ ఉంటారు. అయితే వీటి ఆరోగ్యంపై ఏమాత్రం అజ్రాగత్తగా ఉన్నా.. సరైన సమయంలో టీకాలు వేయించలేకపోయినా.. అపరిశుభ్రంగా ఉంచినా.. వాటి ద్వారా ప్రాణాంతక వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. వీటిని జునోసిస్‌ (జంతువులు, మానవుల మధ్య వ్యాపించే ఏవియన్‌ ఫ్లూ, రేబిన్‌, రిఫ్ట్‌ వ్యాలీ ఫీవర్‌ వంటివి) వ్యాధులు అంటారు. రేబిస్‌ను అరికట్టేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా పశు సంవర్ధకశాఖ ఆధ్వర్యంలో, కొన్ని ప్రైవేట్‌ సంస్థలు ఉచితంగా రేబిస్‌ టీకాలు వేస్తున్నా యి. నేడు జునోసిస్‌ డే సందర్భంగా జంతు ప్రేమికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’ కథనం.

ఏటా జూలై 6న..

జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు సోకే వ్యాధులను జునోసిస్‌ వ్యాధులు అంటారు. లూయిస్‌ పాశ్చర్‌ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా 1885 జూలై 6 న పిచ్చికుక్క కాటుకు గురైన బాలుడికి రేబిస్‌ టీకా వేి స పునర్జన్మ ప్రసాదించి న సందర్భంగా ఏ టా ఇదే రో జు జునోసిస్‌ డేగా నిర్వహిస్తున్నారు. జునోసిస్‌ వ్యాధుల్లో 200 రకాలు ఉన్నట్లు గుర్తించగా.. మొత్తం అంటువ్యాధుల్లో ఇవే 60 శాతం అని అంచనా. జునోసిస్‌ వ్యాధులు పశుపోషకులు, పెంపుడు జంతువుల యజమానులు, రైతులకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.

ప్రధానంగా

వ్యాపించే వ్యాధులు

జునోసిస్‌ వ్యాధుల్లో ప్రధానమైనది రేబిస్‌. ిపిచ్చికుక్క కాటు ద్వారా వ్యాప్తి చెందే ఈ వ్యాధి లక్షణాలు వారం నుంచి పది రోజుల్లో కనిపిస్తాయి. ఈ వ్యాధి సోకిన వారు గుటక వేయలేకపోగా, దాహం వేస్తున్నా నీళ్లు తాగాలంటే భయపడతారు. కుక్క కరిచిన వెంటనే ఆ భాగాన్ని సబ్బుతో శుభ్రంగా కడిగి తగు చికిత్స చేయించుకోవాలి. అలాగే పెంపుడు కుక్కలకు యాంటీ రేబిస్‌ టీకాలు వేయిస్తే ఇబ్బంది ఉండదు. ఇక రేబిస్‌, జపనీస్‌ ఎన్‌సైఫిలైటిస్‌ (మెదడువాపు), వైరల్‌ హైపటైటిస్‌, అమ్మవారు, డెంగీ, కొక్కెర, ఆంత్రాక్స్‌ తదితరాలు సైతం జునోసిస్‌ వ్యాధుల జాబితాలో ఉన్నాయి.

నివారణ ఇలా...

వ్యాధులు సోకిన జంతువులు, కోళ్ల మాంసం, సరిగా ఉడకని గుడ్లు, పాడైన పాలు ఆహారంగా తీసుకోకూడదు. రేబిస్‌ సోకిన పశువుల పాలు తాగకూడదు. పాడి పశువులు, జంతువుల పాకలను ఎల్లప్పుడు శుభ్రంగా ఉంచాలి. పశువులు, జంతువులు, పక్షులు, కోళ్లకు కాలానికి అనుగుణంగా రోగ నిరోధక టీకాలు వేయించాలి. చనిపోయిన పశువులు, జంతువులను దూర ప్రాంతాల్లో లోతైన గోతిలో సున్నం చల్లి పూడ్చి పెట్టాలి.

నా మిత్రుడు అనిల్‌ ఐదేళ్ల క్రితం హస్కి పెట్‌ను నా జీవితంలోకి తీసుకువచ్చాడు. నాటి నుంచి మా కుటుంబంలో ఒకరి లా కలిసిపోయింది. ఎంత ఒత్తిడి ఉన్నా పెట్‌ తో కాసేపు గడపగానే రిలాక్స్‌గా ఉంటుంది. వైద్యులు సూచించినట్లుగా వాక్సినేషన్‌ చేయిస్తుంటాం.

– కృష్ణకాంత్‌, జడ్చర్ల

మనుషులతో సన్నిహితంగా ఉండే జంతువులకు పశు వైద్యులు సూచించిన టీకాలు షెడ్యూల్‌ ప్రకారం వేయించాలి.

జునోసిక్‌ వ్యాధులు, వాటి నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ముందస్తుగా గుర్తించడం వల్ల వ్యాప్తిని నివారించవచ్చు.

బయట తిరిగే పెంపుడు జంతువులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. వాటిపై ఉన్న క్రిములు తొలగించాలి.

కుక్కలు, పిల్లులకు 42 రోజుల నుంచి వ్యాక్సిన్‌ షెడ్యూల్‌ను తయారు చేసుకోవాలి

వ్యాక్సిన్‌ ఇవ్వడం ద్వారా రేబిస్‌తో పాటు వివిధ రకాల బ్యాక్టీరియాలు, రింగ్‌వార్మ్‌ వంటి రోగాల నుంచి దూరం చేయవచ్చు

నాణ్యమైన ఫుడ్‌ అందజేయడం, పరిశుభ్రమైన స్థలంలో నివాసం ఏర్పాటు చేయాలి.

కుక్కలను గొలుసులు వేసి బంధించకుండా ప్రేమతో పెంచాలి. సైగలు, మాటలతోనే దాన్ని నియంత్రించేలా చిన్నప్పటి నుంచే శిక్షణ ఇవ్వాలి. అలా చేయటం వల్ల మనలో కలిసిపోతుంది. కుక్కను పెంచడం ఎంత ముఖ్యమో.. దాని ఆరోగ్యం, ఆహారంపై కూడా అంతే జాగ్రత్తలు పాటించాలి.

– అనిల్‌గౌడ్‌, జడ్చర్ల

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement