పాముఖ్యం :
గ్రీన్‌టీలో కనిపిస్తున్న గండు చీమలు
అలంపూర్: భూమికి భాస్వరం ముఖ్యమైన పోష కం. ప్రకృతి సిద్ధంగా లభించే గాలి, నీరులాగానే మొక్క పెరుగుదలకు కావాల్సిన 16 రకాల పోషకాలు భూమి ద్వారా లభ్యమవుతాయి. అయితే పోషక పదార్థాల లభ్యత నేల రకాన్ని బట్టి నేల భౌతిక స్థితి, రసాయన లక్షణాలు, సూక్ష్మ జీవుల చ ర్య, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. భాస్వరం ప్రాముఖ్యతను మండల వ్యవసాయ అధికారి నాగార్జున రెడ్డి రైతులకు వివరించారు.
కరగని రూపంలో భాస్వరం :
సాగవుతున్న భూముల్లో 60 శాతం కంటే ఎక్కువగా ఉన్న భాస్వరం పోషకం కరగని డై కాల్షియం, ట్రై కాల్షియం ఫాస్పేట్‌ల రూపంలో ఉంటుంది. తేలిక భూముల్లో కంటే బరువు నేల (వరి పండించే డెల్టా భూములు)ల్లో భాస్వరం పోషకం ఎక్కువ శాతం మొక్కలకు అందుబాటులో లేని రూపంలో ఇమిడీకృతమై దాగి ఉంటుంది. ఈ నేలల్లో భాస్వరం వినియోగ సామర్థ్యం తక్కువేనని చెప్పవచ్చు. రైతులు వాడే భాస్వరపు ఎరువుల్లోని భాస్వర పోషకం మోనో కాల్షియం ఫాస్సెట్ రూపంలో ఉంటుంది. ఇది పూర్తిగా నీటిలో కరుగుతుంది. కరిగిన వెంటనే నేలలోని అల్యూమినియం, ఐరన్ ఆకై ్సడ్‌లతోను కాల్షియం, మెగ్నిషీయం కార్బొనేట్లతోనూ రసాయన చర్య జరుపుతుంది. దీని ఫలితంగా అల్యూమినియం ఫాస్పేట్, మెగ్నీషియం ఫాస్పేట్లుగా మారుతాయి. ఇవి కరగని రూపంలో ఉండి తర్వాత భూమిలోని సూక్ష్మజీవుల చర్యల వలన మొక్కకు అందుబాటులోకి వస్తాయి.
ఏ దశలో వేయాలి :
భాస్వరం ముఖ్యంగా వేరు వ్యవస్థను అభివృద్ధి ప రుస్తోంది.వరి పంటలో నాట్లకు ముందు మురుగు దమ్ము చేసేటప్పుడు సింగిల్ సూపర్ ఫాస్పెట్ 75–100 కిలోలు, 20 కిలోల యూరియా కలిపి వే యాలి. లేదా వరి నాటిన తర్వాత పది రోజులకు డీ ఏపీ ప్లస్ యూరియా లేక ఇతర భాస్వరం పోషకం కలిగిన కాంప్లెక్స్ ఎరువులు వేసుకోవాలి. వర్షాధార మెట్ట పంటలకు పత్తి, వేరుశనగ, మొక్కజొన్న మొదలగు పంటలకు ఆఖరి దుక్కిలో వేయాలి.
భాస్వరం ఏ మేరకు వాడాలి....?
మట్టి నమునాల్లో వచ్చే భూసార పరీక్షల ఫలితాల్లో వచ్చే ఆధారంగానే ఎంత భాస్వరం అవసరమో తె లుస్తోంది. దీనిని బట్టి పశువుల ఎరువులు, పచ్చిరొ ట్టే ఎరువులు, జీవన ఎరువులు, రసాయన ఎరువుల ద్వారా భాస్వరాన్ని అందించాలి. సింగిల్ సూ పర్ ఫాస్పేట్ డిఏపీ, ఎన్‌పీకే కాంప్లెక్స్ ఎరువులు మొదలగు వాటి ద్వార భాస్వరాన్ని అందజేయవచ్చు.
జీవన ఎరువుల వలన ఉపయోగాలు :
జీవన ఎరువుల్లో బాసిల్లాస్, సూడోమోనాస్ వంటి సూక్ష్మజీవులు ఆస్పర్జిల్లడ్, పెన్సిలియం వంటి శీలింధ్రాలు భూమిలో భాస్వరాన్ని కరిగించి మొక్కకు అందేలా చూస్తాయి. సిఫార్సు చేసిన భాస్వర మో తాదును ఎకరాకు 10 నుంచి 12 కిలోల వరకూ తగ్గించుకోవచ్చు.పచ్చి రొట్టె ఎరువుల వాడకం వల న భూమి సారవంతమై సూక్ష్మజీవుల సంతతి వృద్ధి చెందుతాయి. మట్టి నమునాల్లో భాస్వరం విలువ 20 కంటే తక్కువ గల భూములను 21 నుంచి 50 వరకు మధ్య భూములుగా పరిగణించబడతాయి.
మొక్కజొన్నలో..
వరిలో భాస్వర లోపం
మొక్కలు భాస్వరాన్ని లవణాల రూపంలో తీసుకుంటాయి.
పూలు, విత్తనాలు, దుంపలు తదితర ఆర్థిక ప్రాముఖ్యత గల పంటలకు ఈ పోషకం చాలా అవసరం.
భూమిలో సేంద్రియ ఎరువులు బాగా కుళ్లుటకు దోహదపడుతుంది.
పంట త్వరగా పక్వానికి రావడానికి ఉపయోగపడుతుంది.
కణ విభజన, పైరు అభివృద్ధి, మొక్కలో మాంసకృతులు, ఎంజైముల తయారీకి ఉపయోగపడుతుంది.
భాస్వరం తగినంత ఉంటే నత్రజని ఎక్కువైన పైర్లకు కలిగే దుష్పలితాలను కొంత మేరకు అరికడుతుంది.
మొక్కకు భాస్వరం లోపిస్తే పత్ర హరితం(క్లోరోఫిల్) ఏర్పడకుండా ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులోకి మారుతాయి.


