తప్పిన పెను ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

తప్పిన పెను ప్రమాదం

Jul 6 2026 12:58 AM | Updated on Jul 6 2026 12:58 AM

బస్సును వెనుక నుంచి ఢీకొట్టిన లారీ

8 మందికి గాయాలు

మానవపాడు: జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న బస్సును వెనుక నుంచి లారీ ఢీకొట్టగా.. పలువురికి గాయాలైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ స్వాతి తెలిపిన కథనం ప్రకారం.. హిందుపూర్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న మార్నింగ్‌ స్టార్‌ ట్రావెల్స్‌ బస్సును అనంతపురం నుంచి జమ్మూకశ్మీర్‌ వైపుగా వెళ్తున్న లారీ మానవపాడు స్టేజీ దాటిన తర్వాత వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. వెంటనే సమాచారం అందుకున్న 108 సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో కర్నూల్‌ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 22 మంది ప్రయాణిస్తుండగా.. దాదాపు 8మందికి పైగా గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై బస్సు డ్రైవర్‌ నరసింహమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్‌ మహ్మద్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

బస్సు, ట్రక్కు ఢీ.. వ్యక్తి దుర్మరణం

దేవరకద్ర రూరల్‌: ట్రక్కు, వోల్వో బస్సు ఢీకొన్న ఘటనలో ట్రక్కు డ్రైవర్‌ మృతి చెందిన ఘటన జాతీయ రహదారి–167పై ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మంగళూరు నుంచి హైదరాబాద్‌కు ప్రయాణికులతో వస్తున్న భారతి ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు, హైదరాబాద్‌ నుంచి రాయిచూర్‌ వైపు వెళ్తున్న మినీ ట్రక్కు దేవరకద్ర సమీపంలోని భారత్‌ పెట్రోల్‌ బంక్‌ వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్‌ దినకర్‌ (22) వాహనంలో ఇరుక్కుపోయి అక్కడిక్కడే మృతి చెందగా.. వోల్వో బస్సు డ్రైవర్‌కు రెండు కాళ్లు విరిగిగాయి. బస్సులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, జేసీబీ సహయంతో ట్రక్కులో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ దినకర్‌ మృతదేహన్ని బయటకు తీశారు. గాయపడిన బస్సు డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తిని అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు దేరవకద్ర ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement