తిరిగి ఇవ్వడంలో జాప్యం | - | Sakshi
Sakshi News home page

తిరిగి ఇవ్వడంలో జాప్యం

Jul 5 2026 7:14 AM | Updated on Jul 5 2026 7:14 AM

బీఎల్‌ఓలకు క్షేత్రస్థాయిలో ఓటర్ల నుంచి ఇబ్బందులు ఎదురువుతున్నాయి. ఇంటింటికి వెళ్లి ఫారాలు అందజేసి.. వివరాలు పూరించి తిరిగి ఇవ్వాలని చెబుతున్నా ఓటర్ల నుంచి స్పందన లేదని, అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తున్నారని బీఎల్‌ఓలు వాపోతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల వివరాలు, ఇంటి నంబర్లు లభించని కారణంతో బీఎల్‌ఓలు ఫారాలు అందించలేకపోతున్నారు. దీంతో చాలాచోట్ల బీఎల్‌ఏల సహకారంతో ఒకే దగ్గర ఉండి ఫారాలు ఇవ్వడం, నింపడం చేస్తున్నారు. ఇప్పటి వరకు పంపిణీ చేసిన ఎన్యూమరేషన్‌ ఫారాల్లో 96,699 (3.53 శాతం) డిజిటలైజేషన్‌ చేశారు. ఈ నెల 30 వరకు ఫారాలు సేకరణ పూర్తి చేసి డిజిటలైజేషన్‌ చేయాలి. ఈ నెల 31న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేయాల్సి ఉండగా.. ఈలోగా ఫారాలు నింపి.. వాటిని డిజిటలైజేషన్‌ చేయడం పెద్ద సవాల్‌గా మారింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement