ఇంటర్‌ గురుకులాల్లో స్పాట్‌ అడ్మిషన్లు | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ గురుకులాల్లో స్పాట్‌ అడ్మిషన్లు

Jul 5 2026 7:14 AM | Updated on Jul 5 2026 7:14 AM

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: జిల్లాలోని పలు ఎస్సీ ఇంటర్మీడియట్‌ గురుకుల కళాశాలల్లో పలు కోర్సులో సీట్లు ఖాళీగా ఉన్నాయని, ఆసక్తి గల విద్యార్థులు చేరాలని ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ అర్చన ఒక ప్రకటనలో తెలిపారు. బాలుర గురుకులంలో ఎంపీసీలో 38, బైపీసీలో 40, బాలికల గురుకులాల్లో ఎంపీసీలో 14, బైపీసీలో 10, సీఈసీలో 8, ఎంఈసీ 14 సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 6వ తేదీన రాంరెడ్డిగూడెం గురుకులంలో నిర్వహించే కౌన్సెలింగ్‌ హాజరుకావాలని, టీసీ, బోనోఫైడ్‌, కులం, ఆదాయం, ఫొటోలతో రావాలని సూచించారు.

డే కేర్‌ను సద్వినియోగం చేసుకోవాలి

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన డే కేర్‌ సెంటర్‌ను మహిళా ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్‌ రాజీవ్‌రెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని డే కేర్‌ సెంటర్‌ను ఆయన తన బృందంతో కలిసి సందర్శించారు. ఉద్యోగుల పిల్లల సంరక్షణ ఎలా ఉందని నిర్వాహకులను అడిగి తెలుకున్నారు. డే కేర్‌లో కల్పించిన సౌకర్యాలు చాలా బాగున్నాయని తెలిపారు. చిన్నారుల సంరక్షణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చంద్రానాయక్‌, సహాయ అధ్యక్షుడు శ్యాంసుందర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు వెంకట్రామిరెడ్డి, నంద కిషోర్‌, నాయకులు మధుసూదన్‌, మల్లయ్య, పటేల్‌ మహేశ్వర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విద్యావ్యవస్థలో మార్పులు రావాలి: యెన్నం

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: విద్యా వ్యవస్థలో మార్పులతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని ప్రభు త్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివా రం నోయిడాలో టీఈడీఎక్స్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ విద్యావంతులు అయినప్పుడే సమాజ వికాసం సాకారమవుతుందన్నారు. విద్య అనేది వ్యక్తిగత ఎదుగుదలకే కాకుండా దేశ అభివృద్ధికీ ఎంతో కీలక మని పేర్కొన్నారు. ‘మహబూబ్‌నగర్‌ ఫస్ట్‌’ ఆధ్వర్యంలో తన నియోజకవర్గంలో అమలు చేస్తున్న విద్యా కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రస్తావించారు. డిజిటల్‌ లెర్నింగ్‌ విస్తరణ, డిజిటల్‌ లైబ్రరీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ద్వారా విద్యార్థులకు కొత్త అవకాశాలు కల్పించామన్నారు. ‘మై విలేజ్‌ స్కూల్‌’ ద్వారా ప్రతి పాఠశాలకు ఆధునిక సదుపాయాలు కల్పిస్తూ, గ్రామీణ విద్యను బలోపేతం చేస్తున్నామన్నా రు. విద్యార్థుల్లో సృజనాత్మకత, నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా వారిని ప్రపంచ స్థాయిలో పోటీపడేలా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ వేదికపై ఒక ప్రజాప్రతినిధిగా పాల్గొ నే అవకాశం దక్కడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement