కోర్టు నిర్మాణ పనుల్లో నాణ్యత ముఖ్యం | - | Sakshi
Sakshi News home page

కోర్టు నిర్మాణ పనుల్లో నాణ్యత ముఖ్యం

Jul 5 2026 7:14 AM | Updated on Jul 5 2026 7:14 AM

భవనాలు త్వరగా పూర్తి చేయాలి

హైకోర్టు న్యాయమూర్తి శ్రవణ్‌కుమార్‌

పాలమూరు: బండమీదిపల్లిలో జరుగుతున్న నూతన కోర్టు కాంప్లెక్స్‌ భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా కోర్టు పరిపాలన అధికారి ఎన్‌వీ శ్రవణ్‌కుమార్‌ పేర్కొన్నారు. జిల్లా కోర్టు న్యాయమూర్తి ప్రేమలతతో కలిసి శనివారం మధ్యాహ్నం నూతన కోర్టు భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఆర్‌అండ్‌బీ అధికారులతో పనుల పురోగతిపై మాస్టర్‌ ప్లాన్‌ పరిశీలించి పనుల నాణ్యతపై ఆరా తీశారు. కోర్టు భవనాలు, పార్కింగ్‌, న్యాయమూర్తుల క్వార్టర్స్‌, కోర్టు చుట్టూ వచ్చే ప్రహరీ ఇతర పనులపై ఆరా తీశారు. సాధ్యమైనంత త్వరగా నిర్మాణ పనులు పూర్తిచేయాలని సూచించారు. ప్రధానంగా కోర్టు నిర్మాణ పనుల్లో చాలా నాణ్యత పాటించడం చాలా ముఖ్యమని తెలిపారు. స్లాబ్‌ నిర్మాణాలు పూర్తి అయిన తర్వాత మరోసారి పరిశీలిస్తానని పేర్కొననఆరు. కార్యక్రమంలో న్యాయమూర్తులు వి.శారదా దేవి, పి.ఆంజనేయులు, మహ్మద్‌ ఆఫ్రోజ్‌ అక్తర్‌, రాజా రాజేశ్వరి,ఈశ్వరయ్య, రాధిక కోర్టు అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement