20 ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే రోజున కృతజ్ఞత సభ ఏర్పాటు చేయడం సంతోషం. ఉమ్మడి పాలమూరులో ఆనాడు మిడ్జిల్, గట్టు మండలాలను డార్క్ మండలాలుగా ప్రకటించారని గుర్తు చేశారు. అత్యంత వెనకబడిన ప్రజలు చీకట్లో నుంచి వెలుగు రావాలని 2006లో మీరు నిర్ణయం తీసుకున్నారు. మీరు తీసుకున్న ఆ నిర్ణయంతో ఈనాడు ముఖ్యమంత్రిగా ఎదిగే అవకాశం వచ్చింది. నాకు ఇంకా అవకాశం ఇచ్చేందుకు ప్రజల వద్ద ఇంకా ఏమీ లేదు. ఉన్నదంతా సర్వం నాకు ఇచ్చారు. అందుకే మిడ్జిల్‌ను తీర్చిదిద్దాల్సిన బాధ్యత నాపై ఉంది. మిడ్జిల్ డార్క్ మండలం కాదు.. ఈ ప్రాంతానికి వెలుగు రేఖలు వచ్చినాయనేది ప్రభుత్వ లెక్కల్లో తేలాలి. ఈ మండలం ఈ జిల్లాకే ఆదర్శంగా నిలవాలనేదే నా కోరిక. అందుకే ఈ మండలాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు దత్తత తీసుకోవాలని కోరుతున్నా.


