‘సీ్త్ర’నిధులు గోల్‌మాల్‌ | - | Sakshi
Sakshi News home page

‘సీ్త్ర’నిధులు గోల్‌మాల్‌

Jul 5 2026 7:14 AM | Updated on Jul 5 2026 7:14 AM

ధన్వాడ: మహిళా స్వయం సహాయక సంఘాలలో ఇటీవల కాలంలో పలు రకాల ఆర్థిక మోసాలు, నిధుల దుర్వినియోగం వెలుగుచూస్తున్నాయి. నిరక్షరాస్యత, అవగాహన లోప మరియు నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు. సీ్త్రనిధి నుంచి తక్కువ వడ్డీకి రుణాలు తీసుకొని రెగ్యులర్‌గా తిరిగి చెల్లిస్తుంటే.. మధ్యలో వీఓఏలు, సీసీలు వాటిని వాడుకొని తినేస్తున్నారు. అంతా తెలిసిన అధికారులు వారినుంచి రికవరీ చేయకుండా మహిళా సంఘాలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. వాటికి వడ్డీ, చక్రవడ్డి వేస్తూ చెల్లించాలని లేకుండా కేసులు నమోదు చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు.

● మండల కేంద్రంలోని మానికేశ్వరి మహిళా సంఘం 26 నవంబర్‌ 2018లో ఇద్దరు మహిళలు రూ.50వేలు, ఐదుగురు మహిళలు రూ.25వేయిల చొప్పున్న రూ.2.50లక్షలను సీ్త్రనిధి కింద వడ్డీకి తీసుకున్నారు. ఇందుకుగాను ప్రతినెలా బ్యాంకులో చెల్లిస్తూ వస్తున్నారు. ఐకేపీ సిబ్బంది వారిని బ్యాంకులో కట్టొద్దు మాకు లెక్క సరిగా రావడంలేదు.. మీరు ఐకేపీ వీఓఏల వద్ద డబ్బులను కట్టాలని సీసీ కుర్మన్న తెలియజేయడంతో అప్పటినుంచి బాలరాం అనే వీఓఏతో డబ్బులను కడుతూ వచ్చారు. ఇలా రెండేళ్లు వీఓఏతో డబ్బులను కట్టారు. వారు కట్టాల్సిన ఈఎంఐ 20జూన్‌ 2022లో పూర్తయింది. కొత్తగా లోన్‌ కోసం వెళ్లగా.. ఐకేపీ సిబ్బంది మీరు లోన్‌ పూర్తిస్థాయిలో కట్టలేదు.. ఇంకా రెండేళ్లకు చెందిన రూ.50వేలు కట్టాల్సి ఉందని చెప్పడంతో మహిళలు అశ్చర్యపోయి వారు కట్టిన పూర్తి రసీదులను అధికారుల ముందు ఉంచారు. అందులో బ్యాంకులో కట్టిన రసీదుల వరకు క్లియర్‌గా ఉండగా.. వీఓఏతో కట్టిన డబ్బులు బ్యాంకులో జమ కాలేదని తేలింది. అప్పటికే వీఓఏ మోసాలు చేశాడని అధికారులు అతనిపై కేసు నమోదు చేశారు. వారు కట్టాల్సిన రూ50వేలకు వడ్డీ, చక్రవడ్డి వేసి ఇప్పుడు రూ.92వేలు కట్టాలని.. వీఓఏ మోసం చేసిన డబ్బులను కట్టాలని మహిళా సంఘాలపై సీ్త్రనిధి అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారు. కనీసం వాటిలో ఆసలు మాత్రమే తీసుకొని వడ్డీ అయినా.. తగ్గించండని నెత్తినోరు మోత్తుకున్నా.. అధికారులు స్పందించలేదు. ఇందులో వన్‌టైం సెటిల్‌మెంట్‌ లాంటివి అవకాశం ఉండదని.. పూర్తిగా డబ్బులను కట్టాల్సిందేనని అధికారులు తేల్చి చెప్పారు. చేసేది లేక మహిళా సంఘాల వారు తమ పొదుపు నుంచి డబ్బులను విత్‌డ్రా చేసి కట్టేందుకు సిద్ధమవుతున్నారు.

రూ.25వేలు తీసుకున్నారు

నేను 2018లో రూ.25వేలు సీ్త్రనిధి కింద రుణం తీసుకున్నా.. ప్రతిరోజు బీడీ కూలీ పనిచేస్తూ వాటిని క్రమం తప్పుకుండా కట్టుకుంటూ వచ్చా. ఇప్పుడు ఐకేపీ అధికారులు డబ్బులు కట్టలేదని.. వడ్డీతోపాటు చెల్లించాలని మాపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇప్పుడు కట్టిన డబ్బులు పోగా ఇంకా రూ.25వేలు చెల్లించాలని లేదంటే ఎలాంటి రుణాలు రావని రోజురోజుకు వడ్డీ పెరుగుతుందని చెబుతున్నారు.

– బుదారపు మణెమ్మ, ధన్వాడ

రెగ్యూలర్‌గా కట్టాను

సీ్త్రనిధి నుంచి తీసుకున్న రుణానికి ప్రతినెల బ్యాంకులో చెల్లిస్తుంటే ఐకేపీ అధికారులు తమకు లెక్క సరిగ్గా రావడలేదు.. మీకు కేటాయించి వీఓఏతో కట్టండని చెప్పారు. మధ్యలో కరోనా రావడంతో ప్రతినెల అతనికి ఇచ్చి రసీదులు తీసుకున్నాం. ఇప్పుడు ఆ రసీదులు పనిచేయవు.. మీరు కట్టాల్సిన డబ్బులు వీఓఏకు ఎందుకిచ్చారు. వీఓఏ కట్టకపోతే మీదే బాధ్యత ఇప్పుడు వడ్డీతో కట్టాల్సిందే లేకుండా రుణాలు ఇవ్వమని తెగేసి చెబుతున్నారు. – గాయిత్రి, ధన్వాడ

డబ్బులు కట్టాల్సిందే..

సీ్త్రనిధి నుంచి డబ్బులు తీసుకున్నవారు సీ్త్రనిధి అంకౌట్‌లోనే డబ్బులు జమ చేయాలని.. అలాకాకుండా సిబ్బంది చెప్పారని వీఓఏలకు అందజేసి వారు కట్టకపోతే మహిళ సంఘాలదే బాధ్యత. వడ్డీ తగ్గింపులాంటి అవకాశాలు ఇందులో ఉండవు. వారు డబ్బులు కట్టాల్సిందే.. – తిరుపతయ్య, ఆర్‌ఎం, సీ్త్రనిధి

చెల్లింపులో వీఏఓల చేతివాటం

మహిళా సంఘాలకు ఇబ్బందులు

డబ్బులు కట్టినవారికి సైతం నోటీసులు

బెదిరింపులకు పాల్పడుతున్న అధికారులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement