డిగ్రీ సెమిస్టర్‌ ఫలితాలు విడుదల | - | Sakshi
Sakshi News home page

డిగ్రీ సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

Jul 5 2026 7:14 AM | Updated on Jul 5 2026 7:14 AM

జడ్చర్ల టౌన్‌: డా.బీఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సెమిస్టర్‌ ఫలితాలను పాలమూరు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ రమేష్‌బాబు, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ప్రవీణ విడుదల చేశారు. ఏప్రిల్‌, మేలో నిర్వహించిన సెమిస్టర్‌ 2, 4, 1, 3 బ్యాక్‌లాగ్‌ పరీక్షల ఫలితాలు విడుదల చేసినట్లు ప్రిన్సిపాల్‌ సుకన్య తెలియజేశారు. ఫలితాల్లో 25శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఫలితాల విడుదలలో విశ్వవిద్యాలయం అదనపు కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డా.అనురాధ, డా.అరుంధతి, వైస్‌ ప్రిన్సిపాల్‌ నర్మద, కళాశాల సీఓఈ ప్రవీణ్‌కుమార్‌, అకడమిక్‌ కో ఆర్డినేటర్‌ రాఘవేందర్‌రెడ్డి, అటానమస్‌ కో ఆర్డినేటర్‌ డా.సులేమాన్‌, జబీన్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement