జడ్చర్ల/మిడ్జిల్: మిడ్జిల్ మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా శనివారం ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట ఆంజనేయస్వామి దేవస్థానం వద్ద తన గెలుపునకు సహకరించిన వారిని ఆయన కలుసుకున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరంలో ఆయన ప్రతి టేబుల్ దగ్గరకు వెళ్లి పేరు పేరున పలకరించి.. యోగక్షేమాలు తెలుసుకున్నారు. వారితో ఫొటోలు దిగారు. ఇన్నేళ్ల తర్వాత కూడా తమను పేరు పెట్టి పిలవడంతో సంబ్రమాశ్చర్యంలో మునిగిపోయారు. అంతకు ముందు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రూ.10 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు.


