ఆర్‌ఎన్‌ఆర్‌ క్వింటా రూ.2,769 | - | Sakshi
Sakshi News home page

ఆర్‌ఎన్‌ఆర్‌ క్వింటా రూ.2,769

Jul 4 2026 2:07 AM | Updated on Jul 4 2026 2:07 AM

జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో శుక్రవారం ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్‌ రకానికి సంబంధించి క్వింటా గరిష్టంగా రూ.2,769, కనిష్టంగా రూ.2,279 ధరలు లభిచాయి. మొక్కజొన్న గరిష్టంగా రూ.2,470, కనిష్టంగా రూ.2,372, పొద్దుతిరుగుడు రూ.5,866 ధరలు లభించాయి. గద్వాల మార్కెట్‌ యార్డుకు 1,400 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. కాగా.. క్వింటా గరిష్టంగా రూ.7,832, కనిష్టంగా రూ.2,639, సరాసరిగా రూ.5,900 ధరలు లభించాయి. అలాగే కంది క్వింటా సరాసరిగా రూ.6,251 పలికింది.

జూరాలకు స్వల్ప ఇన్‌ఫ్లో

ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్ప ఇన్‌ఫ్లో వస్తుంది. శుక్రవారం ప్రాజెక్టుకు కేవలం 223 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. 38 క్యూసెక్కులు ఆవిరైందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 2.511 టీఎంసీల నీరు నిల్వ ఉందని చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement