సభ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌, డీఐజీ | - | Sakshi
Sakshi News home page

సభ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌, డీఐజీ

Jul 4 2026 2:07 AM | Updated on Jul 4 2026 2:07 AM

సభ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌, డీఐజీ

మిడ్జిల్‌: మండలకేంద్రంలో శనివారం సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను జోగుళాంబ డీఐజీ ఎల్‌ఎస్‌ చౌహాన్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎస్పీ జానకితో కలిసి సభా ప్రాంగణం, హెలిప్యాడ్‌, పార్కింగ్‌ స్థలాలను పరిశీలించారు. అనంతరం డీఐజీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు, ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సకాలంలో పూర్తి చేయండి..

సీఎం సభకు సంబంధించి ఏర్పాట్లను అన్ని శాఖల అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ ఖుష్బూగుప్తా ఆదేశించారు. విగ్రహాల ఏర్పాటు స్థలం, హెలిప్యాడ్‌ పనులు, సభ ప్రాంగణంలో ఏర్పాట్లను శుక్రవారం ఆమె పరిశీలించారు. ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా వేగంగా పనులు పూర్తి చేయాలని సూచించారు. కలెక్టర్‌ వెంట అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌రెడ్డి, ఆర్‌డీఓ నవీన్‌, డీఎస్పీ మహేస్‌, తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement