ఉండవెల్లి: తాళం వేసిన ఇంట్లో బంగారు, వెండి ఆ భరణాలు చోరీ జరిగిన ఘ టన మండలంలోని పుల్లూరు గ్రామంలో జరిగింది. హెడ్ కానిస్టేబుల్ వీరన్న తెలిపిన వివరాలు.. కర్నూ లు జిల్లా జూపాడు బంగ్లాకు చెందిన శ్రీనివాసు లు ప్రైవేటు ఫైనాన్స్ ఉద్యోగం చేస్తూ పుల్లూ రు శివారులో కుటుంబంతో కలిసి నివాస ముంటున్నారు. ఈ నెల 1న శ్రీనివాసులు అత్త గారి దినకార్యాలకు ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం జిల్లా కు వెళ్లి 2వ తేదీ రాత్రి ఇంటికి వ చ్చి చూడగా వస్తువులు చెల్లా చెదురుగా పడి ఉండటంతో పాటు 4 తులాల బంగారు, 6 తు లాల వెండి తదితర వస్తువులు కూడా చోరీకి గురైనట్లు గుర్తించారు. అనంతరం ఉండవెల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా శుక్రవారం సీఐ ప్రదీప్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


