నారాయణపేట రూరల్: అరుణాచల్‌ప్రదేశ్‌లోని రాజీవ్ గాంధీ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం ఉడుమల్‌గిద్దకు చెందిన ప్రొఫెసర్ శివరాజ్‌ను ని యమిస్తూ రాష్ట్రపతి ద్రౌపతిముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయమై ఏబీవీపీ జాతీయ మాజీ నా యకుడు అయ్యప్ప అడ్వకేట్ హర్షం వ్యక్తం చేశారు.
నిర్వహించిన బాధ్యతలు
ఓయూలో ముఖ్యపరిపాలన బాధ్యతలు, పీజీఆర్‌ఆర్ దూరవిద్యా కేంద్రం డైరెక్టర్, యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్, రసాయన శాస్త్ర విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్, అభివృద్ధి, యూ జీసీ వ్యవహారాల డీన్, సైన్స్ ఫ్యాకల్టీ డీన్, యూ జీసీ యూపీఈ కార్యక్రమ సమన్వయకర్త, డీఎస్టీ పర్స్ కార్యక్రమ సమన్వయకర్త, పీయూ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహించారు.


