నవాబుపేట: మరో మూ డు రోజుల్లో పెళ్లి పీటలెక్కనున్న వరుడు అకస్మాత్తు గా అదృశ్యమయ్యా డు. ఫలితంగా పెళ్లి ఇంట్లో ఆందోళన మొదలైంది. వరుడి కోసం 24గంటలపాటు వే చిచూసిన కుటుంబ సభ్యులు చివరికి శుక్రవా రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండలంలోని లోకిరేవుకు చెందిన రఘురాంగౌడ్‌కు హైదరాబాద్‌కు చెందిన యువతితో ఈనెల 5వ తేదీన పెళ్లి నిశ్చయించారు. దీనికిగాను అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. శనివారం వరుడు రఘురాం ఇంటిముందు పెళ్లి పందిరి వేయా ల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ నెల 2వ తేదీన పెళ్లి పత్రికలు ఇచ్చి తన మిత్రులు, బంధువులను పెళ్లికి ఆహ్వానించేందుకు జడ్చర్ల వెళ్లి వస్తానని ఇంట్లో నుంచి వెళ్లాడు. కాగా, అదేరో జు మధ్యాహ్నం నుంచి ఫోన్ స్వీచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది బంధువుల చెంత వెతికారు. ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లికొడుకు అదృశ్యంతో ఇటు వరుడు, అటు వధువు కుటుంబ సభ్యు ల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. వరుడి సోద రుడు విజయ్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్‌ఐ నరేందర్ తెలిపారు.
యువకుడి
అనుమానాస్పద మృతి
ఊట్కూర్: మండల కేంద్రంలోని శ్రీరాంనగర్‌వీధిలో శంకర్(25) అనే యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు... గ్రామానికి చెందిన రోషనప్ప, పద్మమ్మ కుమారుడు శంకర్ నారాయణపేటలోని ఓ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తుండేవాడు. సాయంత్రం ఇంట్లో నిద్రిస్తున్న కుమారుడిని తండ్రి నిద్రలేపగా అపస్మారక స్థితిలో ఉండటంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అనుమానాస్పదంగా మృతి చెందాడని మృతుడి తండ్రి రోషినప్ప పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రమేశ్ తెలిపారు.
అల్లుడి దాడి ఘటనలో మామ మృతి
కేటీదొడ్డి: కుటుంబ కలహాల నేపథ్యంలో అల్లుడి వరుసైన వ్యక్తి దాడి చేసిన ఘటనలో గాయపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాలు.. మల్లాపురం తండాకు చెందిన మూడావత్ రాజునాయక్ (45) అల్లుడి వరుసైన పాండునాయక్ ఈ నెల 2న మధ్యాహ్నం ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో రాజునాయక్ తల, పొత్తికడుపుపై బలంగా దాడి చేశాడు. ఈ క్రమంలో తెల్లవారుజామున మూత్రం రాకుండా ఇబ్బందులు పడుతుండగా కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో రాజునాయక్ మృతి చెందాడు. మృతుడి భార్య నీలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.


