మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: కేజీబీవీలో మౌలిక వసతులు కల్పిస్తామని రీజినల్ జాయింట్ డైరెక్టర్ సోమిరెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఏనుగొండ కేజీబీవీలో విద్యార్థులకు అవసరమైన పరికరాలను కార్పొరేట్ రెస్పాన్సిబుల్ ఫండ్ కింద 25 లీటర్ల సామర్థ్యం గల మూడు వేడినీటి గీజర్లు, 15 కిలోల సామర్థ్యం గల రోటీ మేకింగ్ మిషన్, 16 కిలోల స్టీల్ కుక్కర్, 20 లీటర్ల సామర్థ్యం గల 8 కూల్ వాటర్ క్యాన్‌లను శుక్రవారం విద్యార్థులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్వీఎస్ ఆస్పత్రి సహకారంతో మౌలిక సదుపాయాలు సమకూర్చుతున్నామన్నారు. ఉచిత వసతి, పోషకాహారం, యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, డిజిటల్ విద్యతో పాటు నీట్, ఎంసెట్ వంటి వాటికి ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. డీఈఓ విజయకుమారి, జీసీడీఓ అస్త్రాఖాద్రీ, ఎస్‌ఓ శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు.


