విచారణ దశలో ఉంది
గద్వాల క్రైం: అక్రమంగా ఇసుక తరలించే వ్యాపారులపై జిల్లా పోలీసు శాఖ కూపీలాగుతున్నారు. మరోవైపు వ్యాపారుల మధ్య ఘర్షణలకు తావిస్తుంది. మూడురోజుల క్రితం ఓ ఇసుక వ్యాపారి మరో ఇసుక వ్యాపారికి ఫోన్‌లో బెదిరింపులకు పాల్పడిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వ్యవహారంపై సీఐ స్థాయి అధికారిని ఏర్పాటు చేసి గుట్టుగా విచారణ చేపట్టింది. జోగుళాంబ గద్వాల జిల్లాలోని తుంగభద్ర నది పరివాహక గ్రామాల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అక్రమార్కులు ప్రభుత్వ అనుమతులు లేకండా ఇసుకను టిప్పర్ల ద్వారా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. అయితే గద్వాల మండలంలో ని ఓ గ్రామానికి చెందిన తాజా యువ సర్పంచ్ అదే గ్రామానికి చెందిన ఇసుక వ్యాపారి మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో సర్పంచ్‌కు చెందిన టిప్పర్లు అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నాయని రెవెన్యూ, మైనింగ్, పో లీసు, విజిలెన్స్ అధికారులకు వైరి వర్గంకు చెందిన వ్యాపారి సమాచారం అందజేయండం కారణంగా ఇసుక టిప్పర్ల ను అదుపులోకి తీసుకుంటున్నారని గ్రహించాడు. దీంతో సదరు వ్యాపారితో యువ సర్పంచ్ ఫోన్ లో మాట్లాడారు. ఇక నుంచి అధికారులకు ఫిర్యా దులు చేయడం విరమించుకోవాల్సిందిగా పేర్కొన్నాడు. ముందునుంచి ఇసుక వ్యాపారంలో మీరే ఉన్నారు. ఎప్పుడు ఫిర్యాదులు చేయలేదు. అనవసరంగా సమస్యను సృష్టిస్తున్నా రు. ప్రతినెలా మాములు ఇస్తున్నాం.. నువ్వు ఏం చేసిన వ్యాపా రం చేస్తామని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య తారస్థాయిలో వివాదాని కి దారితీసింది. ఈ వ్యాపారంలో నువ్వో.. నేనో చూసుకుందాం.ఏవరో ఒక్కరు మీగులుతారంటూ మాట్లాడిన సంభాషణ పలు సామాజిక మాఽ ద్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ వ్యవహారంపై జిల్లా పోలీసు శాఖ ముమ్మరంగా కూపీలాగుతోంది.
పోలీసుల విచారణలో..
గద్వాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఆ ఇద్దరు అక్రమ ఇసుక వ్యాపారులది నేర చరిత్ర ఉన్న నేపథ్యం. ఇరవై ఏళ్లుగా బ్రదర్స్ అక్రమ ఇసుక వ్యాపారంలో పైచేయిగా ఉంది. మంత్రు లు, ఎమ్మెల్యేల అభయహస్తంతోపాటు అధికారులను భయభ్రాంతులకు గురి చేసేవారు. మరో వైపు ప్రజాప్రతినిధుల అండతో బ్రదర్స్ ప్రభుత్వ అనుమతులు పొందినట్లు ఫేక్ అనుమతి పత్రాల తో కొన్నేళ్లు ఇసుకను తరలించారు. ఈ ఘటనపై బ్రదర్స్‌పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అక్రమ ఇసుక వ్యాపారంలో యువ సర్పంచ్ సైతం కొన్నేళ్లుగా గ్రామంలోని చెరువు నుంచి ఇసుక తరలిస్తూ కొంత ఆర్థికంగా పురోగతి చెంది నేడు తుంగభద్ర నుంచి టిప్పర్ల ద్వారా ఇసుకను అక్రమంగా తరలించే స్థాయికి చేరుకున్నాడు. యువ సర్పంచ్ ఫిల్టర్ ఇసుకను ట్రాక్టర్‌ల నుంచి తరలించిన ఘటనలపై కేసులు నమోదయ్యాయి. వివిధ వ్యవహారాలపై పోలీసులు రెండు రోజులుగా ఇద్దరి నేర చరిత్రను జిల్లా ఉన్నతధికారులకు నివేదికలను అందజేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఫోన్ సంభాషణలో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులకు మామూలు ఇచ్చిన వ్యవహారంపై నివేదికలను అందజేసినట్లు తెలుస్తుంది.
మూడు రోజల క్రితం సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఫోన్ సంభాషణపై ఇప్పటికే విచారణ జరుగుతుంది. అక్రమంగా ఇసుక తరలించే నేరస్తుల పూర్తి సమాచారంపై ఆరా తీస్తున్నాం. ప్రస్తుతం విచారణ దశలో ఉంది. ఇద్దరిపై నమోదైన వివిధ కేసులపై విచారణ చేపట్టాం. త్వరలోనే ఇద్దరిని అరెస్టు చేస్తాం. ఇందుల్లో ఏవరి ప్రమేయం ఉన్నా.. ఉపేక్షించేది లేదు.
– మొగిలయ్య, డీఎస్పీ
ఇసుకాసురులపై కూపీలాగుతున్న
పోలీసు శాఖ
బెదిరింపు కాల్స్‌పై కొన్నసాగుతున్న విచారణ
వ్యాపారుల నేర చరిత్రపై వాకాబు


