వర్షాధారంగా ఆముదం సాగు చేసే హైబ్రీడ్‌ రకాలు | - | Sakshi
Sakshi News home page

వర్షాధారంగా ఆముదం సాగు చేసే హైబ్రీడ్‌ రకాలు

Jul 3 2026 12:52 AM | Updated on Jul 3 2026 12:52 AM

జిల్లాలో ఆముదం సాగుకు అనువైన రకాలు..

కొత్తకోట రూరల్‌: వర్షాదారంగా సాగు చేసే నూనె గింజ పంటల్లో ఆముదం ఒక ముఖ్యమైన పంట. వానాకాలంలో జూన్‌ రెండో వారం నుంచి జూలై చివరి వారం వరకు ఆముదం సాగు చేసుకోవచ్చును. నీరు బాగా పీల్చుకునే ఎర్రనేలలు, నల్లరేగడి, గరపనేలలు ఆము దం సాగుకు అనుకూలమని మదనాపురం కేవీకే శాస్త్రవేత్త డాక్టర్‌ రాజేందర్‌రెడ్డి సూచిస్తున్నారు. ఆముదంలో హైబ్రీడు రకాలైతే 2 కిలోలు 4కిలోలు ఎకరాకు విత్తనంగా అవసరం ఉంటుంది. వర్షాదారం ఆముదంలో అంతర పంటలుగా రెండు వరుసలు పెసర, మినుము, పెబ్బె ర్లు, గోరు చిక్కుడు, వేరుశనగ, సాగు చేసుకొని అధిక ఆధాయం పొందవచ్చును. ఆముదంలో కంది పంటను 1–1 నిష్పత్తిలో అంతర పంటగా సాగు చేసుకోవచ్చును.

నేలలు: నీరు ఇంకే భూములు సాగుకు అనుకూలం. బలమైన భూములలో సాగు చేస్తే ఎక్కువ దిగుబడులు సాధించవచ్చును. బీడు నేలలు సాగుకు అనుకూలం కాదు. హైబ్రీడు రకాలను 90 సెం.మీ సాలు సాలుకు మరియు 60 సెం.మీ విత్తనానికి విత్తనానికి మధ్య దూరంలో సాగు చేసుకోవచ్చును.

● కలుపు యాజమాన్యం: ఆముదంలో విత్తనం వేసిన 48గంటల లోపల మందును ఎకరా కు పిచికారి చేసుకోవాలి. ఆముదంలో 45– 60రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి.

● ఎరువుల యాజమాన్యం: ఎకరాకు 2–3 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. ఎకరా కు 25కిలోల నత్రజని 16కిలోల భాస్వరం 15కిలో ల పోటాషి యం ఎరువులను వేసుకోవాలి.

● ఆముదం పంట వయస్సు: 45–50 రోజుల పంట కాలంలో పైరులో లేత ఇగుఉరులను తీసివేయ డం వల్ల పక్క కొ మ్మలు ఎక్కువగా వచ్చి గాళసైజు కాయసైజు ఎక్కువగా వచ్చేందుకు తోడ్పడుతుంది.

● వర్షాదారంగా బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు 2–3 తడులను 10రోజు లకు వ్యవధిలో ఇవ్వడం వల్ల అధిక దిగుబడి సాధించవచ్చును.

పాడి–పంట

ప్రగతి (పీసీఎస్‌–262): పంట కాలం 120– 140 రోజులు, స్వల్ప కాలిక రకం అధిక నూనె శాతం కలింగి ఉంటుంది. ఎండు తెగులు తట్టుకుంటుంది.

హరిత (పీసీఎస్‌–124): పంట కాలం 130– 150 రోజులు, బెట్ట, ఎండు తెగులు తట్టుకుంటి.

పీసీహెచ్‌ (పీసీహెచ్‌–111): పంట కాలం 120– 140 రోజులు, ఎండు తెగులును తట్టుకుంటుంది.

డీసీహెచ్‌ (డీసీహెచ్‌–177): పంట కాలం 130–160 రోజులు, బెట్టను తట్టుకుంటుంది.

డీసీహెచ్‌ (డీసీహెచ్‌–519): పంట కాలం 130– 160 రోజులు, ఎండు తెగులును తట్టుకుంటుంది.

ఐసీహెచ్‌–66 (ఐసీహెచ్‌–66): పంట కాలం 130–150 రోజులు, ఎండు తెగులు, వేరుకుళ్లు, పచ్చదోమ తట్టుకుంటుంది.

ఐసీహెచ్‌–5: పంట కాలం 130–150 రోజులు ఎండు తెగులు, వేరుకుళ్లు, పచ్చదో మను తట్టుకుంటుంది. అధిక సాంద్రతలో సాగు చేసేటందుకు అనుకూలం.

ఐసీహెచ్‌–6: పంట కాలం 110–140 రోజు లు ఎండు తెగులు, వేరుకుళ్లు తెగుళ్ల వ్యాధులను తట్టుకుంటుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement