జడ్చర్ల టౌన్: రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్ బాలికల ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌కు మండలంలోని కొడ్గల్ సమీపంలో ఉన్న నచికేత విద్యామందిర్‌కు చెందిన 10 మంది విద్యార్థినులు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ విజయ్ మోహన్ తెలిపారు. శుక్రవారం నుంచి నిజామాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొ నే ఉమ్మడి జిల్లా జట్టుకు సాయిప్రియ, శ్రీవల్లి, శ్రీవర్షిణి, అక్షిత, అక్షర, సంజన, పూజిత, అంబికాశ్రీ, ప్రేక్ష, హర్షవర్దిని ఎంపికయ్యారన్నారు. ఈ మేరకు విద్యార్థినులను గురువారం పాఠశాల ఆవరణలో అభినందించి నిజామాబాద్‌కు పంపించారు. కార్యక్రమంలో పీఈటీ నరేష్, వైస్ ప్రిన్సిపాల్ పాండు, అధ్యాపకులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు సూగూరు విద్యార్థి
వనపర్తి రూరల్: పెబ్బేరు మండలంలోని సూగూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న జి.శారద రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాలికల ఫుట్‌బాల్ పోటీ లకు ఎంపికై ందని హెచ్‌ఎం ఆర్.వెంకటరమణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 3, 4, 5 తేదీల్లో నిజామాబాద్ జిల్లాలో జరగనున్న రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ ఫుట్‌బాల్ బాలికల క్రీడల్లో వనపర్తి జట్టు తరఫున శారద పాల్గొంటారని ఆయన తెలిపారు. పెబ్బేరు పట్టణంలోని ఫుట్‌బాల్ క్రీడా మైదానంలో ఈ నెల 01న ఎంపికలు జరగగా.. ప్రతిభ కనబరిచిన శారద అవకాశం దక్కించుకున్నారని పాఠశాల పీడీ ఎండీ షబీర్ తెలిపారు.
భారీగా నల్లబెల్లం పట్టివేత
బల్మూర్: మండలంలోని బాణాల శివారులోని వ్యవసాయ పొలంలో దాచిన నిషేధిత నల్ల బెల్లం డంపును గురువారం ఎకై ్సజ్ పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ఎకై ్సజ్ ఎస్‌ఐ సతీష్ కుమార్ తెలిపిన వివరాల మేరకు.. బాణాల గ్రామానికి చెందిన రాజేష్, ధారాసింగ్ తమ పొలంలో అక్రమంగా నల్ల బెల్లం బస్తాలను డంపు చేశారనే సమాచారం మేరకు డీటీఎఫ్ సీఐ రాజేశ్వరి, ఎస్‌ఐ అరుణ, సిబ్బందితో దాడులు చేశారు. 25 బస్తాలలో 750 కిలోల నల్లబెల్లం పట్టుకొని నిందితులిద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. దాడులలో డీటీఎఫ్, అచ్చంపేట ఎకై ్సజ్ సిబ్బంది పాల్గొన్నారు.
జూరాల డ్యాం వద్ద
పవర్ కేబుల్ చోరీ
ధరూరు : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద సీవేజ్ డ్రెయినేజీ పంపునకు సంబంధించిన పవర్ కేబుళ్లను గురువారం గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు. విషయం తెలుసుకున్న ప్రాజెక్టు ఏఈ సుదర్శన్ యాదవ్ రేవులపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నందికర్ తెలిపారు.


