విత్తనాలు సరిగా మొలకెత్తలేదు..
దేవరకద్ర మండలం లక్ష్మీపల్లికి చెందిన పి.చంద్రశేఖర్‌కు మూడు ఎకరాల సొంత భూమి ఉండగా, వరి సాగు కోసం పొలాన్ని సిద్ధం చేసి తుక్కంపోశారు. మరో నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని పత్తి సాగు ప్రారంభించారు. వానలు అనుకూలిస్తాయన్న నమ్మకంతో తొందరపడి పత్తి విత్తనాలు నాటారు. అయితే ఆశించినస్థాయిలో వర్షాలు కురవకపోవడంతో విత్తనాలు సరిగా మొలకెత్తలేదు. కొద్దిగా వచ్చిన మొలకలు ఎండకు వాడిపోయాయి. పత్తి సాగుకు, విత్తనాలు, కూలీల ఖర్చులన్ని కలిపి ఎకరానికి రూ.15వేల వరకు నష్టం వాటిల్లిందని, వర్షాలు వస్తాయని నమ్మి అప్పులు చేసి పెట్టుబడి పెట్టానని చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


