పంటలకు సమగ్ర పోషణ ముఖ్యం | - | Sakshi
Sakshi News home page

పంటలకు సమగ్ర పోషణ ముఖ్యం

Jul 2 2026 2:47 AM | Updated on Jul 2 2026 2:47 AM

సమగ్ర పోషక యాజమాన్యంలో ముఖ్య అంశాలు..

కొత్తకోట రూరల్‌: పూర్వం రైతులు అందుబాటులో ఉన్న సహజ వనరులను ఉపయోగించి వ్యవసా యం చేసేవారు. ప్రస్తుతం రైతాంగం సహజ వనరులైన నీరు, భూములను మితిమీరి వినియోగంచడం వలన గ్రామీణ ప్రజల జీవనోపాధులను పూర్తిగా ప్రభావితం చేస్తున్నాయి. రైతులు మొక్కల పోషణకు అవసరమైన పోషకాలను అందించడానికి మో తాదుకు మించి రసాయనిక ఎరువులను వాడటం వల్ల నేలలు నిస్సారంగా మారడం, పంటలకు చీడ పీడల వ్యాప్తి అధికమవుతుంది. కొన్ని పోషకాలు ఎక్కువ మొతాదులో వాడినప్పుడు భూమిలోనే నిరుపయోగంగా స్థిరీకరించబడతాయి.

సేంద్రియ

ఎరువులతో భూమి సారవంతం

మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి 17 పోషకాలు అవసరం. వీటిలో ముఖ్యమైనవి కార్బన్‌, హైడ్రోజ న్‌, ఆక్సిజన్‌ అలాగే ఇతర పోషకాలు గాలి, నీరు ద్వారా లభిస్తాయి. రసాయనిక ఎరువులు, సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులను తగిన మోతాదులో ఉపయోగించి పంటలకు పోషకాలను అందించడాన్ని ‘సమగ్ర పోషక యాజమాన్యం’గా పిలుస్తారు. పంటలకు సిఫార్సు చేసిన పోషక మోతాదులో మూడింట రెండు వంతులు రసాయనిక ఎరువుల ద్వారా ఒక వంతు సేంద్రియ, జీవన, పచ్చిరొట్ట ఎరువుల ద్వారా అందిస్తే భూమి నిస్సారం కాకుండా కాపాడుకోవచ్చు.

భూసారం: భూములలో తగ్గిపోతున్న సేంద్రియ పదార్థం, చెడు నేలలుగా మారడం, పంట నాణ్యత, దిగుబడిపై ప్రభావం చూపుతున్నాయి. వరుస పంటల సాగు కారణంగా జింక్‌, గంధకం, ఐరన్‌, బోరాన్‌ లోపాలు ఎక్కువగా కనబడుతాయి.గట్టిపడుతున్న భూమి పై పొరలు, భూమి లోని పోషకాలకు అవరోధం కలిగిస్తాయి. కావున రైతాంగ భూసార పరీక్షల ద్వారా పోషక విలువలను తెలుసుకొని ఎరువులను వాడుకోవాలి.

రసాయన ఎరువులు: రైతాంగం నత్రజని, భాస్వరం, పోటాష్‌, జించ్‌ గంధకం పోషకాలు ప్రధానంగా రసాయనిక ఎకువుల ద్వారా అందిస్తుంటారు. నత్రజని, భాస్వరం, పోలాష్‌ను 4:2:1 నిష్పత్తిలో వాడాలి. కానీ రైతాంగం ప్రస్తుతం 9.5: 2.7:1.0 వాడుతున్నారు.

సేంద్రియ ఎరువులు: వ్యర్థా పదార్థాలలో అధికంగా కార్బనం, నత్రజని ఉంటుంది. కావున పంటలకు లభ్యం కావు. వీటిని బాగా కుళ్లింపచేసి పంటలకు వాడుకోవాలి. టన్ను సేంద్రియ ఎరువు నుంచి సరాసరి 5 నుంచి 8 కిలోల నత్రజని, పోటాస్‌, 2 కిలోల భాస్వరం లభిస్తాయి. సేంద్రియ ఎరువుల్లో సూక్ష్మపోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి వాడటం వల్ల భూమి భౌతిక, రసాయనిక లక్షణాలు మెరుగుపడతాయి.

పచ్చిరొట్ట ఎరువులు: పచ్చి రొట్ట ఎరువులలలో నత్రజని 2 నుంచి 3 శాతం ఉంటుంది. పచ్చిరొట్ట పంటలైన జనుము, జీలుగ, పిల్లిపెసర, పెబ్బర్లు, మరియు మినుములు లాంటి పంటలను విత్తిన 40–50 రోజులకు భూమిలో తీరు ఉన్నప్పుడు కలియదున్నాయి. వరుసగా పచ్చి రొట్ట పంటలను సాగు చేయడం వల్ల భూమిలో నత్రజని, కర్బనం పెరిగి జీవ రసాయన చర్యలు వేగవంతమై భూ భౌతిక లక్షణాలు మెరుగుపడతాయి.

పంట మార్పిడి: క్రమంగా పంట మార్పిడి చేసి నత్రజని పంటలైన పెసర, మినుము, పెబ్బర్లు, కంది సాగు చేయడం వల్ల కలుపు సమస్య తగ్గి భూసారం పెరుగుతుంది. అదే విధంగా సహజ క్రిమి శత్రువులు పెరుగుతాయి.

జీవన ఎరువులు: ప్రకృతిలో గల సూక్ష్మజీవులు స్వతంత్రంగా కానీ మొక్కలతో కానీ కలిసి జీవ ప్రక్రియల ద్వారా మొక్కలకు కావాల్సిన పోషకాలను వాతావరణం లేదా నేల నుంచి గ్రహించే వాటిని జీవన ఎరువులు అంటారు. ఇవి మార్కెట్‌లో రైజోబియం, ఫాస్పోభాక్టీరియా, అజటోబాక్టీరు, మరియు ఆజైస్పరిల్లమ్‌ రూపంలో లభ్యమవుతాయి.

పంట అవశేషాలు: ప్రస్తుతం రైతాంగం పంట అవశేషాలను కాల్చడం వల్ల భూమి నిస్సారమవుతుంది. పంట అవశేషాలను పొలంలో కుళ్లించి భూమిలో కలిపి వేయాలి. ప్రతి టన్ను వరిగడ్డిలో 400 కిలోల పోటాష్‌ 50 కిలోల సిలికాన్‌ ఉంటాయి.

పాడి–పంట

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement