కళకు ‘శృతి’ కలిసే | - | Sakshi
Sakshi News home page

కళకు ‘శృతి’ కలిసే

Jul 2 2026 2:47 AM | Updated on Jul 2 2026 2:47 AM

కొనసాగిస్తున్న

కళాకారుడైన తండ్రి వా రసత్వం

గిన్నిస్‌ రికార్డు సాధించిన

చిన్నారి శృతి

మదనాపురం: పువ్వు పుట్టగానే పరిమళించినట్టు.. కంటే కూతుర్నే కనాలి, మనసుంటే మగాడిలా పెంచాలి అనే నానుడిని అక్షరాలా నిజం చేస్తోంది ఆ కు టుంబం. అటు చదువులో ఫస్ట్‌.. ఇటు నృత్యంలో బెస్ట్‌ అంటూ జిల్లా, రాష్ట్ర జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారు ఆ అక్కాచెల్లెళ్లు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం సింగో టం గ్రామానికి చెందిన జానపద ఉద్యమ కళాకారుడు గుడిసె శివలింగం ప్రస్తుతం వనపర్తి నివా సి తన కుమార్తెలను కళా వినీ లాకాశంలో ధ్రువతారలుగా తీర్చిదిద్దుతున్నారు. చిన్న కుమార్తె శృతి తాజాగా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించి పాలమూరు మట్టి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది.

మహానృత్యంలో గిన్నిస్‌ రికార్డు

హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక కూచిపూడి నత్య ఉత్సవంలో చిన్నారి పాల్గొంది. వేలాది మంది నృత్య కళాకారుల మధ్య ప్రదర్శించిన కూచిపూడి నృత్య రీతులు వీక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ అద్భుత ప్రదర్శనకు గాను గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు సర్టిఫికెట్‌ను అందుకొని చరిత్ర సృష్టించింది.

కళల శివలింగం..

సృజనాత్మక వారసత్వం

స్వయంగా జానపద ఉద్యమ కళాకారుడైన గుడిసె శివలింగం తన పిల్లల కు కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా, వి ద్యా బుద్ధులతో పాటు సృజనాత్మకత ను, కళలను నూరిపోశారు. తండ్రి ఆశయాలకు తగ్గట్టే అటు చదువులో రాణిస్తూనే, ఇటు నృత్యంలో అంతర్జాతీయ స్థా యి గుర్తింపు తెచ్చుకుంది.

ప్రముఖుల ప్రశంసలు

గిన్నిస్‌ రికార్డు సాధించిన చిన్నారి శృతిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ (పాలమూరు) జిల్లా వాసులతో పాటు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, పలువురు కలెక్టర్లు, వివిధ సంఘాల ప్రజాప్రతినిధులు, సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని రికార్డులు సృష్టించాలని ఆకాంక్షించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement