ద్విచక్రవాహనం పైనుంచి పడి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

ద్విచక్రవాహనం పైనుంచి పడి వ్యక్తి మృతి

Jul 2 2026 2:47 AM | Updated on Jul 2 2026 2:47 AM

పెద్దకొత్తపల్లి: మండలంలోని చిన్న కొత్తపల్లి గ్రామానికి చెందిన గువ్వలి బాలయ్య (45) బుధవారం రాత్రి ద్విచక్రవాహనం పైనుంచి పడి మృతి చెందా డు. మండల కేంద్రం నుంచి చిన్నకొత్తపల్లి గ్రామానికి వెళ్తుండగా పెద్దకార్పాముల–చిన్నకారుపాము ల గ్రామాల మధ్యలో అదుపుతప్పి బైక్‌ పై నుంచి కిందపడ్డాడు. ప్రమాదంలో అక్కడికక్కడే మరణించినట్లు స్థానికులు తెలిపారు. బాలయ్యకు ఇద్దరు భార్యలు, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు.

పిచ్చికుక్క దాడిలో

పది మందికి గాయాలు

తెలకపల్లి: పిచ్చికుక్క స్వైర వి హారం చేస్తూ కనిపించిన వారందరిని కాటు వేసి భయాందోళనకు గురి చేసిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. బు ధవారం సాయంత్రం మండలంలోని బొప్పల్లిలో పిచ్చికుక్క తిరుగుతూ కనిపించిన వారిని కాటువేస్తూ గాయపర్చిందని గ్రామ స్తులు తెలిపారు. బొడ్డుపల్లి వెంకటేష్‌, గౌరారం సైదులు, నిషంత్‌, నవ్యశ్రీ, యశ్వంత్‌, శేఖర్‌తో పాటు మరో కొంతమందిని కాటు వేసింది. బాధితులను 108 వాహనంలో నాగర్‌కర్నూల్‌ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు.

చికిత్స పొందుతూ

మహిళ మృతి

ఉండవెల్లి: బైక్‌పై లిఫ్ట్‌ అడిగి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మహిళ మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. పో లీసులు తెలిపిన వివరాలు.. మానవపాడు మండ లం బోరవెల్లి గ్రామానికి చెందిన లక్ష్మీదేవి(54) జూన్‌ 30న మంగళవారం బోరవెల్లి నుంచి అలంపూర్‌కు వెళ్లేందుకు రోడ్డుపై ఉండగా అటుగా బైక్‌పై వెళ్తున్న కాంతారెడ్డిని లిఫ్ట్‌ అడగడంతో ఎక్కించుకొ ని వెళ్తున్నారు. ఈ క్రమంలో ఉండవెల్లి శివారులోని ఆర్డీఎస్‌ కెనాల్‌ సమీప మార్గంలో జాతీయ రహదారిపై లక్ష్మీదేవి బైక్‌పై నుంచి కిందపడటంతో తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో కర్నూలు జనరల్‌ ఆసుపత్రికి తరలించగా బుధవారం మృతి చెందింది. మృతురాలి తమ్ముడు వెంకట్రాముడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ వీరన్న తెలిపారు.

మహిళ గోప్యతకు భంగం.. ఏడాది ౖజైలుశిక్ష

కోస్గి రూరల్‌: మహిళకు సంబంధించి ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో అసభ్యకరంగా పోస్ట్‌ చేసిన కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్ష పడినట్లు కోస్గి సీఐ సైదులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. 2016లో కోస్గి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మహిళ గోప్యతకు భంగం కలిగించిన ఘటనపై కేసు నమోదైంది. ఈ క్రమంలో పోలీసులు నిందితుడు బర్రె కృష్ణయ్యను అరెస్ట్‌ చేశారు. విచారణలో నేరం రుజవు కావడంతో జూనియర్‌ సివిల్‌ జడ్జి సుస్మిత బుధవారం సదరు వ్యక్తికి ఏడాది కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారికి చట్టరీత్యా చర్యలు తప్పవని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement