జడ్చర్ల: వాట్సాప్‌కు ఒక మెసేజ్ పంపించి దాని ద్వారా దశల వారీగా రూ.5.25 లక్షలు స్వాహా చేసిన ఘటన మండలంలోని నసరుల్లాబాద్ తండాలో చోటు చేసుకుంది. సీఐ కమలాకర్ కథనం మేరకు.. నసరుల్లాబాద్ తండాకు చెందిన కె.శంకర్ ఫోన్ వాట్సాప్‌కు మహేశ్వర్‌రావు వ్యక్తి మెసేజ్ పంపి తనను తాను హెచ్‌ఆర్‌గా పనిచేస్తున్నానంటూ పరిచయం చేసుకున్నాడు. భారత్ ఫర్టిలైజర్స్ స్టోర్స్ ఏజెన్సీ ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. దీంతో బాధితుడు తన ఖాతా నుంచి దశల వారీగా అతడు ఇచ్చిన బ్యాంకు ఖాతాలకు రూ.5.25 లక్షలను బదిలీ చేశాడు. చివరకు నిందితుడు ఫోన్‌లో బదులు ఇవ్వకపోవడంతో తాను మోసపోయినట్లు గ్ర హించి బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
24 ట్రాక్టర్ల
ఇసుక డంపులు సీజ్
రాజోళి: మండలంలోని పెద్ద ధన్వాడలో అక్రమంగా డంపు చేసిన 24 ట్రాక్టర్ల ఇసుకను రెవెన్యూ అధికారులు బుధవారం సీజ్ చేశారు. తహసీల్దార్ పి.రామ్మోహన్ తెలిపిన వివరాల మేరకు.. పెద్ద ధన్వాడ గ్రామ శివారులోని తుంగభద్ర నది నుంచి అనుమతులు లేకుండా ఇసుకను తీసి, స్థానికంగా నిల్వ చేశారనే సమాచారంతో ఆర్‌ఐ చంద్రకాంత్, సిబ్బంది గ్రామంలో తనిఖీలు చేపట్టారు. పలు చోట్ల నిల్వ ఉంచిన 24 ట్రాక్టర్ల ఇసుక డంపులను గుర్తించి, వాటిని సీజ్ చేశారు. వాటికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తహసీల్దార్ తెలిపారు.


