దేవరకద్ర: వారం రోజులుగా కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంపై అదనపు కలెక్టర్, దేవరకద్ర నియోజకవర్గ ఎన్నికల అధికారి మధుసూదన్‌నాయక్ సమీక్షించారు. బుధవారం తహసీల్దార్‌లతో జరిగిన సమావేశంలో సర్ కార్యక్రమంపై చర్చించారు. అన్ని మండలాల్లో సర్ ద్వారా ఓటరు నమోదు జరగాలని సూచించారు. ఎక్కడా తప్పులు జరగకుండా ప్రతి ఓటరు నమోదయ్యేలా బీఎల్‌ఓలు చూడాలని, తహసీల్దార్ల పర్యవేక్షణ నిరంతరం ఉండాలన్నారు. అనంతరం వివిధ రాజకీయ పార్టీల నేతలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ సర్‌కు అందరు సహకరించాలని, బీఎల్‌ఏలు సమన్వయంతో పని చేసే విధంగా చూడాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్‌లు హర్షద్, సుందర్‌రాజు, ఎల్లన్న, కిషన్, రాజు, శేఖర్, వివిధ పార్టీల నాయకులు అంజిల్‌రెడ్డి, నాగిరెడ్డి, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.


