మిడ్జిల్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం మిడ్జిల్ నుంచి ప్రారంభించి జూలై 4వ తేదీకి 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా పాలమూరు బిడ్డకు ఘనంగా స్వాగతం పలికేందుకు జడ్చర్ల నియోజకవర్గంతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం సభ, విగ్రహల ప్రతిష్ట కార్యక్రమ ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు, స్థానిక నాయకులు, అధికారులు సమన్వయంతో పనిచేసి సభను విజయవంతం చేయాలని సూచించారు. సీఎం రాకతో మిడ్జిల్, ఊర్కొండ మండలాలు ఎంతో అభివృద్ధి చెందుతాయని, ప్రతి గ్రామానికి అభివృద్ధి నిధులు ఇవ్వడం ఎంతో సంతోషమన్నారు. ఆయన వెంట నాయకులు రబ్బానీ, అల్వాల్‌రెడ్డి, గౌస్, సాయిలు, శంకర్, మల్లిఖార్జున్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, తదితరులుఉన్నారు.
● సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనకు సంబంధించిన భద్రత ఏర్పాట్లను బుధవారం ఎస్పీ జానకి పరిశీలించారు. ట్రాఫిక్ నియంత్రణ, వాహన పార్కింగ్ ప్రజల రాకపోకలు, అధికారుల సమన్వయం తదితర అంశాలపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సజావుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు అన్ని శాఖల విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఆర్‌అండ్‌బీ ఈఈ సంధ్య, సీఐ మహేష్, ఎస్‌ఐ శ్రీనువాసులు ఉన్నారు.


