విద్యా వలంటీర్ల నియామకానికి పరీక్ష | - | Sakshi
Sakshi News home page

విద్యా వలంటీర్ల నియామకానికి పరీక్ష

Jul 2 2026 2:35 AM | Updated on Jul 2 2026 2:35 AM

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: నియోజకవర్గంలోని వంద ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా వలంటీర్లను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సొంత నిధులతో నియమించించేందుకు గాను బుధవారం స్థానిక బీకేరెడ్డి కాలనీలోని ‘మహబూబ్‌నగర్‌ ఫస్ట్‌’ శిక్షణ కేంద్రంలో అభ్యర్థులకు స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించారు. దీనికి 430 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్ష వందేమాతరం ఫౌండేషన్‌, ‘మహబూబ్‌నగర్‌ ఫస్ట్‌’ సంయుక్త ఆధ్వర్యంలో జరిగింది.

ఉత్సాహంగా

అత్యాపత్య ఎంపికలు

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మెయిన్‌ స్టేడియంలో బుధవారం జిల్లాస్థాయి సబ్‌ జూనియర్‌ (అండర్‌–14) బాలబాలికల అత్యాపత్య ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అత్యాపత్య అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి మహ్మద్‌ ముంతాజ్‌ మాట్లాడుతూ ఎంపికయ్యే జిల్లా జట్లు హైదరాబాద్‌లో ఈనెల 10 నుంచి 12 వరకు జరిగే రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్‌ పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు. కార్యక్రమంలో ఉప కార్యదర్శులు రవి, ఉస్మాన్‌ పాల్గొన్నారు.

94 శాతం ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీ

18 ఏళ్ల తర్వాత ఇప్పటూర్‌కు ఆర్టీసీ బస్సు

– వివరాలు 9లో..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement