అర్హతలు
● రాష్ట్రస్థాయిలో బాల, బాలికల ఎంపికలు
● హాజరుకానున్న వివిధ జిల్లాల
క్రీడాకారులు
మహబూబ్‌నగర్ క్రీడలు: పాలమూరు మెయిన్ స్టేడియంలోని రాష్ట్రస్థాయి వాలీబాల్ అకాడమీ ప్రతి భకు కేరాఫ్‌గా నిలుస్తోంది. గతేడాది జూన్ రెండో వారంలో రాష్ట్రస్థాయి ఎంపికలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన బాలబాలికలకు వాలీబాల్ అకాడమీలో ప్రవేశాలు కల్పించారు. అకాడమీలో ఉదయం, సా యంత్రం వేళల్లో ప్రత్యేక శిక్షణతోపాటు భోజన, వస తి సౌకర్యం కల్పించారు. అకాడమీ బాలబాలిక లు అనతికాలంలోనే వాలీబాల్‌పై పట్టుసాధించి రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించారు.
● జిల్లాకేంద్రంలోని రాష్ట్ర వాలీబాల్ అకాడమీలో ప్రవేశాల కోసం గురువారం ఉదయం 8 గంటలకు రాష్ట్రస్థాయి బాలబాలికల ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి జె.రాజశేఖర్‌రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. క్రీడాకారుల శారీరక, క్రీడా నైపుణ్యాన్ని పరిశీలించి ఎంపిక చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. గతంలో ఏదైనా రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రాధాన్యం ఉన్నట్లయితే సంబంధిత సర్టిఫికెట్లతో హాజరుకావాలని, వారికి ఎంపికలో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. అకాడమీలో ప్రవేశాల కోసం అర్హులైన క్రీడాకారులు నేరుగా సంబంధిత ధృవపత్రాలతో (ఒరిజనల్, జిరాక్స్) ఉదయం 8 గంటలకు మెయిన్ స్టేడియంలో హాజరుకావాలని, మిగతా వివరాల కోసం వాలీబాల్ కోచ్‌లు అబ్దుల్ రహెమాన్‌ఖాన్ 97041 50321, పర్వేజ్‌పాష 77805 82604 నంబర్లను సంప్రదించాలని కోరారు. అకాడమీకి ఎంపికై న క్రీడాకారులకు ఉచిత శిక్షణా, భోజన, వసతి సదుపాయం కల్పించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని ఆసక్తిగల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీవైఎస్‌ఓ సూచించారు.
తీసుకురావాల్సిన ధ్రువపత్రాలు
ప్రస్తుతం చదువుతున్న స్కూల్ లేదా కళాశాల నుంచి స్టడీ సర్టిఫికెట్. జనన ధ్రువీకరణ పత్రం (సంబంధిత అధికారులు తహసీల్దార్/పంచాయతీ/మున్సిపాలిటీ నుంచి జారీ చేయబడింది.) పది పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు. ఆధార్‌కార్డు /రెసిడెన్షియల్ సర్టిఫికెట్.
అకాడమీలో ప్రవేశాల కోసం 30.6.2010 నుంచి 1.7.2012 మధ్య జన్మించి ఉండాలి. బాలబాలికలు 14 ఏళ్ల నుంచి 16 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. బాలుర ఎత్తు 182 సెం.మీ, బాలికల ఎత్తు 166 సెం.మీ పైబడి ఉండాలి.


