అలంపూర్ రూరల్: అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదో శక్తిపీఠం జోగుళాంబ అమ్మవారి సన్నిధిలో మంగళవారం వైభవంగ శ్రీచక్ర ప్రతిష్ఠాపన ఉత్సవాలను ఈఓ దీప్తిరెడ్డి ప్రారంభించారు. ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు మంగళవారం గణపతి, గోమాతపూజ, యాగశాల ప్రవేశం, దీక్షధారణ, వాస్తుశాంతి, పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
చికిత్స పొందుతూ మహిళ మృతి
జడ్చర్ల: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. సీఐ కమలాకర్ కథనం మేరకు.. మండల పరిధిలోని పోలేపల్లి గ్రా మానికి చెందిన కొంగలి సుజాత(45) ఆదివారం మల్లేపల్లికి వెళ్లి తిరిగి పోలేపల్లికి కుమారుడి తో కలిసి బైకుపై వస్తుండగా ఎదురు గా వచ్చిన మరో బైక్ ఢీకొట్టింది. ప్రమా దంలో సుజాత తీ వ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం జడ్చర్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించగా మంగళవారం తెల్లవారుజామున మృతి చెందింది. మృతురాలి భర్త జంగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


