దుఃఖాన్ని దిగమింగుతూ అవయవదానం | - | Sakshi
Sakshi News home page

దుఃఖాన్ని దిగమింగుతూ అవయవదానం

Jul 1 2026 1:16 AM | Updated on Jul 1 2026 1:16 AM

కృష్ణా: ఎదిగిన కొడుకు మృతి చెందినా అతడి అవయవాలు మరొకరికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో తమ దుఃఖాన్ని దిగమింగుతూ అవయవాలను దానం చేసి ఆదర్శంగా నిలిచింది ఓ కుటుంబం. మండలంలోని ఆలంపల్లి గ్రా మానికి చెందిన కొనింటి కిరణ్‌కుమార్‌(24) హైదరాబాద్‌లో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతూ పార్ట్‌టైం జాబ్‌ చేస్తున్నాడు. కాగా వారం రోజుల క్రితం బైక్‌పై వెళ్తుండుగా జరిగి న రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్రగాయం కావడంతో కోమాలోకి వెళ్లాడు. మంగళవారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో మృతుడి తల్లి ఎల్లమ్మ తన కొడుకు అవయవాలు లివర్‌, కిడ్నీ, గుండె దానం చేసింది. అవయవాలు దానం చేయడం మూలంగా మరో ముగ్గురుకి ప్రాణం పోశారని గ్రామస్తు లు అభినందనలు తెలియజేశారు.

చెరువులో

పడి మహిళ మృతి

పెద్దకొత్తపల్లి: ప్రమాదవశాత్తు చెరువులో పడి మహి ళ మృతి చెందిన ఘటన మంగళవారం మండలంలో చోటు చేసుకుంది. గ్రా మస్తులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని గంట్రావుపల్లికి చెందిన పగిడాల సువర్ణ(54) మంగళవారం మధ్యాహ్నం దుస్తులు శుభ్రం చేసేందుకు గ్రామంలోని పెద్ద చెరువుకు వెళ్లింది. దుస్తులు శుభ్రం చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తుతో చెరువు నీటిలో మునిగి చనిపోయింది. మృతురాలికి భర్త రాజయ్య, కుమారుడు శ్రీశైలం ఉన్నారు. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ సతీష్‌ తెలిపారు.

జాతీయస్థాయి బాక్సింగ్‌ పోటీల్లో కాంస్యం

మహబూబ్‌నగర్‌ క్రీడలు: ఇటీవల మధ్యప్రదేశ్‌లో జరిగిన జాతీయస్థాయి కిక్‌బాక్సింగ్‌ పోటీ ల్లో ప్రతిభ చాటి పాయింట్‌ ఫైట్‌లో కాంస్య పతకం సాధించిన స్పోర్ట్స్‌ కిక్‌బాక్సింగ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ మహబూబ్‌నగర్‌ జిల్లా విద్యార్థి వినూత్నను మంగళవారం ఎస్పీ డి.జానకి అభినందించారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు రవికుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement