ప్రస్తుతం రెండు ఎకరాల రైతులకే రైతు భరోసా ఇస్తున్నట్లు ప్రకటించడం నిరాశ కలిగిస్తోంది. గతంలో రైతుబంధు ద్వారా వచ్చిన పెట్టుబడి సాయంతో విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ అవసరాలను సమకూర్చుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు రైతు భరోసా వస్తుందన్న ఆశ కూడా కనిపించడం లేదు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రైతుల్లో అనిశ్చితిని పెంచుతున్నాయి. ఈసారి కూడా ఎక్కువ ఎకరాలు ఉన్న రైతులకు నిరాశే మిగిలే పరిస్థితి కనిపిస్తోంది. – శ్యామ్‌సుందర్‌రెడ్డి, లింగంపల్లి, నవాబుపేట మండలం
అర్హులందరికీ అందిస్తాం..
రైతు భరోసా పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాల మేరకు అర్హులైన రైతులకు దశల వారీగా పెట్టుబడి సాయం అందించే ప్రక్రియ కొనసాగుతోంది. రైతులు ఆధార్, భూ వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు సక్రమంగా నమోదు చేసుకోవాలి. ఏవైనా సాంకేతిక, ఇతర సమస్యలు ఉంటే సంబంధిత వ్యవసాయ అధికారులను సంప్రదించి పరిష్కరించుకోవచ్చు . – గోవింద్‌నాయక్,
జిల్లా వ్యవసాయశాఖ అధికారి
భరోసాతో ప్రయోజనం లేదు..
రైతు భరోసా పేరుతో ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయం పూర్తిస్థాయిలో రైతులకు ఉపయోగపడటం లేదు. రెండు ఎకరాలకే భరోసా నిధులు విడుదల చేయడం వల్ల మిగతా భూమి సాగు చేసే రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నాకు మూడెకరాల భూమి ఉంది. గత యాసంగిలో ఒక ఎకరాకే రైతు భరోసా అందగా, ఈసారి రెండు ఎకరాలకే ఇస్తామని చెబుతున్నారు. రైతులకు నిజమైన మేలు జరగాలంటే ఐదు ఎకరాల వరకు రైతు భరోసా అందించాలి.
– జి.కాంతారావు, గూడూరు, చిన్నచింతకుంట
●


