ఫిజిక్స్‌ అరుణ్‌కు ‘సరోజినీదేవి’ పురస్కారం | - | Sakshi
Sakshi News home page

ఫిజిక్స్‌ అరుణ్‌కు ‘సరోజినీదేవి’ పురస్కారం

Jun 30 2026 2:53 AM | Updated on Jun 30 2026 2:53 AM

కందనూలు: జిల్లా కేంద్రానికి చెందిన కవి, రచయి త ఫిజిక్స్‌ అరుణ్‌కుమార్‌కు ’ఉత్తమ కవిత’ విభాగంలో చల్లా సరోజినీదేవి స్మారక సాహిత్య పురస్కారం– 2026 లభించింది. ఆదివారం రాత్రి హైదరాబాద్‌ రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఫిజిక్స్‌ అరుణ్‌ సినీ ప్రముఖుల సమక్షంలో అవార్డుతో పాటు నగదు పురస్కారం, సన్మానం పొందారు. మహిళా సాధికారత రచనాంశంపై ‘అంతా ఆమెమయం‘ శీర్షికతో రాసిన కవిత ఉత్తమ కవితల విభాగంలో ఒకటిగా నిలిచింది. ఆమె అన్నింటిలో సగం కాదు, అనంతంలో సమస్తమంటూ మహిళ లు నేడు శాస్త్రవేత్తలుగా, పర్యావరణ ప్రేమికులుగా, ఉపాధ్యాయులుగా, పారిశ్రామిక వేత్తలుగా, ప్రభు త్వ ఉద్యోగులుగా, రాజకీయ నాయకులుగా కంపెనీల అధినాయకులుగా ఇలా అన్ని రంగాల్లో కీలకంగా మారారనీ, అయినప్పటికీ ఇంకా అక్కడక్కడ కుల, మత ఛాందసవాదంతో అనాగరిక, అమానుష, లైంగిక దాడులకు గురవుతూనే ఉన్నారనీ కవితలో వివరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులకు అరుణ్‌ తన రచనలు శూన్యం, బిగ్‌ బ్యాంగ్‌ను అందించి అభినందనలు పొందారు. కార్యక్రమంలో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, మోటివేషనల్‌ స్పీకర్‌ ఆకెళ్ల రాఘవేంద్ర, కమెడియన్‌ శ్రీనివాసరెడ్డి, ప్రముఖ సినీ రచయితలు డాక్టర్‌ వెనిగళ్ల రాంబాబు, గోపీ చిరంజీవి, ప్రముఖ రచయిత్రులు జ్వలిత, నీరజాచంద్రన్‌, చల్లా సరోజినీదేవి కుటుంబ సభ్యులు భానుకిరణ్‌, వంశీకిరణ్‌, సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement