కల్వకుర్తి టౌన్: ఉర్కొండ మండలం రేవల్లి గ్రామంలో శనివారం జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు సోమవారం సీఐ భీమ్ కుమార్, ఉర్కొండ ఎస్‌ఐ రమాదేవితో కలిసి వివరాలు వెల్లడించారు. రేవల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మూఢ నమ్మకాలను నమ్మే ఇతను జాతకాలు చెప్పే వారి వద్దకు వెళ్లి తన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నాడు. ఈ క్రమంలో సదరు వ్యక్తులు నీ పైన ఎవరో క్షుద్ర పూజలు చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అదే గ్రామంలో ఉన్న యాదయ్యపై ఆంజనేయులు అనుమానం పెంచుకొని అతడిని హత్య మార్చాలని నిర్ణయించుకున్నాడు. పతకం ప్రకారం ఈ నెల 26న రాత్రి యాదయ్యపై కత్తితో దాడి చేసి చంపేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని పట్టుకొని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. హత్యకు ఉపయోగించిన కత్తి, బైక్, దుస్తులను స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరు పరచగా జడ్జి రిమాండ్ విధించారు. 48 గంటలలో హత్య కేసును చేధించిన సీఐ, ఎస్‌ఐ, పోలీస్ సిబ్బందిని ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్, కల్వకుర్తి డీఎస్పి వెంకట్ రెడ్డి అభినందించారు.
● హత్య కేసులో నిందితుడి అరెస్ట్
● వివరాలు వెల్లడించిన సీఐ


