తెలంగాణ గుండె చప్పుడు సాయిచంద్‌ | - | Sakshi
Sakshi News home page

తెలంగాణ గుండె చప్పుడు సాయిచంద్‌

Jun 30 2026 2:53 AM | Updated on Jun 30 2026 2:53 AM

మాట్లాడుతున్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ­

హాజరైన జనం

అమరచింత: తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన పాటలతో చైతన్యం తీసుకొచ్చి తెలంగాణ గుండె చప్పుడుగా సాయిచంద్‌ ప్రజలకు తరతరాలుగా గుర్తుండిపోతారని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. దివంగత రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ సాయిచంద్‌ 3వ వర్ధంతిని పట్టణంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిచంద్‌ విగ్రహానికి పలువురు బీఆర్‌ఎస్‌ నాయకలు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ సాయిచంద్‌ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నా.. ఏనాడు పదవులను ఆశించలేదన్నారు. ఆయన సేవలను గుర్తించి కేసీఆర్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌తో గౌరవించారని, బంగారు భవిష్యత్‌ ఉన్న సాయిచంద్‌ అకాల మరణం పార్టీకి, రాష్ట్రానికి తీరని లోటు మిగిల్చిందన్నారు. సాయిచంద్‌ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆయన సతీమణి రజని ప్రజల్లో మమేకమై ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నారని కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫుడ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ రాజీవ్‌సాగర్‌, రాష్ట్ర గిడ్డంగుల మాజీ చైర్‌పర్సన్‌ రజనీసాయిచంద్‌, నాయకులు నాగభూషణంగౌడ్‌, నరసింహులుగౌడ్‌, కౌన్సిలర్‌ తిరుమలేష్‌, మాజీ కౌన్సిలర్‌ రాజ్‌కుమార్‌, డీజే శేఖర్‌, విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement