జడ్చర్ల: మహబూబ్‌నగర్ అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ సోమవారం తృటిలో రోడ్డు ప్రమా దం బారి నుంచి బయటపడ్డారు. ఆయన ఆర్డీఓ నవీన్‌కుమార్‌తో కలిసి బాలానగర్ పర్యటన ము గించుకుని జడ్చర్ల వైపు వస్తుండగా గొల్లపల్లి సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై ఆయన ప్రయాణిస్తున్న వాహనం రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. వరుసగా నాలుగు వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అదనపు కలెక్టర్ ప్రయాణిస్తున్న వాహనం ముందు భాగం ధ్వంసమైంది. విషయం తెలుసుకున్న స్థానిక రెవె న్యూ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం అద నపు కలెక్టర్ అధికారులతో కలిసి మరో వాహనంలో వెళ్లిపోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు.
సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన
మిడ్జిల్: మండల కేంద్రంలో జూలై 4న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసే బహిరంగ సభ ఏర్పాట్లు, పార్కింగ్, హెలిప్యాడ్ స్థలాన్ని అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్, ఆర్డీఓ నవీన్, డీఎస్పీ మహేష్‌కుమార్ పరిశీలించారు. ఆయన వెంట ఈఈ నరేందర్‌రెడ్డి, తహసీల్దార్ రాఘవేందర్‌రెడ్డి, ఎస్‌ఐ శ్రీనివాసులు, స్థానిక నాయకులు అల్వాల్‌రెడ్డి, గౌస్, వెంకటయ్య, సాయిలు, శంకర్, మల్లికార్జున్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, శంకర్‌నాయక్, సత్యంగుప్తా, రాజునాయక్ తదితరులు పాల్గొన్నారు.


