బాధితులకు న్యాయం చేయండి: ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

బాధితులకు న్యాయం చేయండి: ఎస్పీ

Jun 30 2026 2:47 AM | Updated on Jun 30 2026 2:47 AM

మహబూబ్‌నగర్‌ క్రైం: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి బాధితులు హాజరై ఎస్పీ డి.జానకికి వినతులు అందించారు. ఒక్కొక్కరి సమస్యలు తెలుసుకున్న ఎస్పీ ఆయా స్టేషన్‌ అధికారులతో నేరుగా ఫోన్‌లో మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో ఏమాత్రం ఆలస్యం చేయవద్దని, అధికారులు సమన్వయంతో పని చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు. జిల్లావాసులు తమ సమస్యలను చట్టబద్ధమైన మార్గాల్లో పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement